కరోనాను మించిన టిక్‌టాక్ వైరస్.. రోగి నిర్వాకం ఇదీ..   - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాను మించిన టిక్‌టాక్ వైరస్.. రోగి నిర్వాకం ఇదీ..  

April 1, 2020

 Tamil nadu Corona Patient Tiktok in Ward

టిక్ టాక్ పిచ్చి ఎంత వరకైనా తీసుకెళ్తుందనడానికి ఇదే నిదర్శనం. ఓ వైపు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ కూడా టిక్‌టాక్‌ను వదిలిపెట్టలేదు 25 ఏళ్ల మహిళ. కరోనా వార్డులో ఆమె చేసిన టిక్ టాక్ వీడియోను పోస్ట్ చేసింది. ఆస్పత్రి వార్డులోనే శానిటైజేషన్ సిబ్బందితో కలిసి ఓ బాధాకరమైన పాటకు మూమెంట్స్ ఇచ్చింది. ఇది పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే వైరల్ అయింది. దీంతో ఆమెతో కలిసి టిక్ టాక్ చేసిన సిబ్బందిపై అధికారులు వేటువేశారు. తమిళనాడులోని అరియలూర్ జిల్లాలో ఇది జరిగింది. 

స్థానికంగా ఉండే ఓ షాపింగ్ మాల్‌లో పని చేసే ఆ మహిళ ఖాళీ సమయాల్లో టిక్ టాక్ చేస్తూ ఉండేది. దీంతో ఆమెకు పెద్ద ఎత్తున ఫాలోవర్స్ వచ్చిపడ్డారు. ఏది చేసినా వెంటనే వైరల్ అయ్యేది. కానీ మార్చి 26న అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కరోనా పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి ఐసోలేషన్ వార్డులో నాలుగు గోడల మధ్య ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ఏమి తోచక మార్చి 28న టిక్‌టాక్ వీడియో చేసింది. కరోనాతో తాను పడుతున్న బాధలను వివరించింది. దీంట్లో శానిటైజేషన్ చేసే ముగ్గురు సిబ్బంది కూడా ఉన్నారు. వెంటనే వారిని విధుల నుంచి తొలగించారు. కాగాఇటీవలే ఆమెకు వైరస్ సోకడంతో వైద్య సిబ్బంది ఆమెకు చికిత్స అందిస్తున్నారు.