కరోనా పరీక్ష.. తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా పరీక్ష.. తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం

June 6, 2020

 

Tamil nadu

రోజురోజుకు తమిళనాడులో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రులలో నిర్ణీత ధరలను నిర్ణయించింది. కరోనా లక్షణాలు స్వల్ప లక్షణాలు ఉన్నవారు, కరోనా లక్షణాలు లేనివారిని ఏ1, ఏ2 కేటగిరీలుగా ప్రభుత్వం వర్గీకరించింది. ఏ1, ఏ2 కేటగిరి రోగుల చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రులు రూ.7,500 ఫీజును వసూలు చేసుకోవచ్చని నిర్ణయించింది. అలాగే ఏ3, ఏ4 కేటగిరి జనరల్‌ వార్డు రోగుల నుంచి రూ.5,000 ఫీజును వసూలు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

కరోనా చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని బాధితుల నుంచి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తమిళనాడు ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు ఏ1, ఏ2, ఏ3, ఏ4 కేటగిరీలకు సంబంధించి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐసీయూ విభాగానికి మాత్రం రూ.15,000 వసూలు చేసుకోవచ్చని వెల్లడించింది.