Tamil Nadu has implemented new traffic rules
mictv telugu

క్యాబ్, ఆటో రైడ్‌ క్యాన్సిల్ చేస్తే రూ. 500 జరిమానా

October 28, 2022

Tamil Nadu has implemented new traffic rules

ఆన్‌లైన్ విధానం వచ్చాక రవాణా సౌకర్యాలు చాలా ఈజీగా పొందే వీలు దొరికింది. మొబైల్‌లో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ వేస్తే ఉన్న దగ్గరికే కార్లు, ఆటోలు, బైకులు వచ్చేస్తున్నాయి. అయితే కొందరు వాహనం బుక్ చేసుకున్న తర్వాత తీరా వాహనం దగ్గరికొచ్చే సమయానికి ఆర్డర్ క్యాన్సిల్ చేస్తున్నారు.

చివరి నిమిషంలో బుకింగ్ రద్దు చేస్తున్నారు. వాహనదారులు కూడా మినహాయింపేమీ కాదు. వారు కూడా ఇష్టం లేకపోతే బుకింగ్ రద్దు చేసి ప్రయాణీకులను ఇబ్బంది పెడుతున్నారు. ఇక నుంచి ఇలా చేస్తే రూ. 500 జరిమానా విధించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 28 నుంచి అమలయ్యే విధంగా కొత్త ట్రాఫిక్ రూల్స్ విధించింది. చివరి నిమిషంలో రైడ్ రద్దు కేసులు ఈ మధ్య విపరీతంగా రావడంతో ఈ మేరకు మార్పులు చేసింది. మిగతా నిబంధనలు మనకు తెలిసినవే అయినా బుకింగ్ రద్దు చేస్తే జరిమానా అంశం కొత్తగా చేర్చడంతో చర్చనీయాంశంగా మారింది. మరి ఇలాంటి నిబంధన మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రావాల్సిన అవసరం ఉందా? మీ అభిప్రాయన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.