Tamil nadu inquiry committee cleans chit Nayanthara and Vignesh's surrogacy
mictv telugu

నయనతారకు క్లీన్‌చిట్.. సరోగసీపై కమిటీ తేల్చేసింది..

October 26, 2022

Tamil nadu inquiry committee cleans chit Nayanthara and Vignesh's surrogacy

నయనతార హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. తమిళనాడు ప్రభుత్వం వేసిన విచారణ కమిటీ ఆమె సరోగసీ పిల్లల ఉదంతంపై నిర్ణయం వెలువరింది. ఆమె చట్టబద్ధంగా సరోగసీ విధానంలో పిల్లల్ని కనిందని తేల్చింది.

హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌లు ఇటీవల దుబాయ్‌లోని దగ్గరి బంధువు ద్వారా సరోగసీ విధానంలో కవల పిల్లలకు జన్మినిచ్చారు. అయితే ఇటీవలే పెళ్లి చేసుకుని ఉండడంతో సరోగీసి చట్టవిరుద్ధమని ఫిర్యాదు అందింది. అయితే తాము 2016 పెళ్లి చేసుకున్నామని కొత్త ప్లస్ పాత దంపతులు విచారణ కమిటీకి అఫిడవిట్ సమర్పించారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణ కమిటీ నియమించింది. కమిటీ అన్ని వివరాలను పరిశీలించి బుధవారం నివేదిక సమర్పించింది. నయన్, విఘ్నేష్ 2016 మార్చి 11న పెళ్లి చేసుకున్నారని, 2021 ఆగస్టు నెలలో సరోగసీ ఏర్పాట్లు చేసుకరున్నారని కమిటీ తెలిపింది. ఈ దంపతులు చెన్నై ఆసుపత్రిలోనే పిల్లలను కన్నారని పేర్కొంది. సరోగసీ చట్టం ప్రకారం పెళ్లయిన ఐదేళ్ల లోపు పిల్లలు లేకపోతేనే సరోగసీకి అర్హులు. దీంతో నయన్ దంపతులు గడువు వరకు వేచి సరోగసీని ఆశ్రయించారు.