దుబ్బాక ఉప ఎన్నికల్లో ట్విస్ట్.. పరిశీలకుడిగా తమిళనాడు ఐపీఎస్ - MicTv.in - Telugu News
mictv telugu

దుబ్బాక ఉప ఎన్నికల్లో ట్విస్ట్.. పరిశీలకుడిగా తమిళనాడు ఐపీఎస్

October 28, 2020

దుబ్బాక ఉప ఎన్నికలు తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచాయి. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల వరుసగా నోట్ల కట్లలు పట్టుబడటంతో రెండు పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నాయి. సిద్ధిపేటకు వస్తుండగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. దీంతో అధికార దుర్వినియోగం  జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 

దుబ్బాక ఉప ఎన్నికకు ప్రత్యేక పరిశీలకుడిగా ఐపీఎస్ ఆఫీసర్‌ను నియమించింది. తమిళనాడుకు చెందిన సీనియర్ ఐపీఎస్ సరోజ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించింది సీఈసీ. నగదు తరలింపు, దాడులు వంటివాటిపై ప్రత్యేక ఫోకస్ పెట్టి ఎన్నికలు సజావుగా జరిపేందుకు అధికారాలు ఇచ్చారు. దీంతో దుబ్బాక ఎలక్షన్ మొత్తం వ్యవహారాన్ని స్పెషల్ ఆఫీసర్ సమీక్ష చేయనున్నారు. ఇప్పటికే బీజేపీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల పర్యవేక్షణలోనే పోలింగ్ జరగాలని కోరిన సంగతి తెలిసిందే.