పాముల బావిలో నెమలి కోసం (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

పాముల బావిలో నెమలి కోసం (వీడియో)

December 2, 2019

Tamil Nadu Man Risks His Life, Climbs Down Snake Infested Well to Save Drowning Peacock.

బావిలో పడ్డ నెమలిని ఓ యువకుడు రక్షించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. తమిళనాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. చాలా వెడల్పుతో ఉన్న పురాతన వ్యవసాయ బావిలో జాతీయపక్షి ప్రమాదవశాత్తు పడిపోయింది.  30 అడుగుల లోతున నీళ్లు ఉన్నాయి. అందులో ఎన్నో రకాల విష సర్పాలు తిరుగుతున్నాయి. 

నెమలి వాటి బారినుంచి తప్పించుకోవడానికి ఎగరడానికి ప్రయత్నిస్తూ నీళ్లలో పడిపోయింది. దీంతో తన రెక్కలు నానిపోయి, బావిలో ఓ రాయిమీద నిస్సహాయంగా కూర్చుంది. చలికి వణుకుతూ ఉంది. ఇది గమనించిన ఓ యువకుడు దానిని కాపాడాలనుకున్నాడు. వెంటనే ఈ విషయాన్ని మరికొందరు యువకులకు చెప్పాడు. విష సర్పాలు ఉన్నందున బావిలోకి దిగడానికి గజ ఈతగాళ్లు సైతం సాహసించరు.

అలాంటిది ఆ యువకుడు సాహసించాడు. అందరూ బావి వద్దకు చేరుకున్నారు. వారి సహాయంతో నడుముకు తాళ్లు కట్టుకుని చాలా చాకచక్యంగా బావిలోకి దిగాడు. విష సర్పాలను తప్పించుకుని  నెమలిని రక్షించాడు. బావిలోంచి పైకి తీసుకొచ్చిన ఆ నెమలిని ఒడ్డున విడిచిపెట్టగానే అది రెక్కలు విప్పుకుని పరుగెత్తుకు వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు, ఆ యువకుడి సాహాసాన్ని అభినందిస్తున్నారు.