బంగారు ఉంగరాలను పంచిన మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

బంగారు ఉంగరాలను పంచిన మంత్రి

February 24, 2020

Tamil Nadu minister gifts gold rings to newborns on Jayalalithaa's 72nd birth anniversary    

కొత్తగా జన్మించిన శిశువులకు తమిళనాడు రాష్ట్ర మంత్రి డి. జయకుమార్ ఇవాళ బంగారు ఉంగరాలను బహుమతిగా పంచిపెట్టారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత 72వ జయంతి సందర్భంగా రోయపురం ఆర్ఎస్ఆర్ఎం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయన ఉంగరాలు బహుమతిగా ఇచ్చారు. జయలలిత జయంతి సందర్భంగా తమ కార్యకర్తలంతా పేదలకు సాయం చేయడంతో పాటు, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని అన్నాడీఎంకే పార్టీ పిలుపునిచ్చింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున జయలలితకు నివాళులు అర్పించారు. 

అలాగే తలైవికి నివాళిగా ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం రాష్ట్ర సచివాలయం వద్ద మొక్కలు నాటి ఘనంగా నివాళులు అర్పించారు. జయలలిత జయంతి రోజైన ఫిబ్రవరి 24ను మహిళలు, చిన్నారుల భద్రతా దినోత్సవంగా నిర్వహిస్తామంటూ ముఖ్యమంత్రి పళనిస్వామి ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. ఆమెను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెట్టింది.