ఏపీ వాళ్లు రాకుండా గొయ్యి తవ్వుకున్న తమిళోళ్లు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ వాళ్లు రాకుండా గొయ్యి తవ్వుకున్న తమిళోళ్లు

May 6, 2020

tamil nadu officials dig road to avoid ap people
కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాకుండా ఉండడానికి తమిళనాడు ప్రజలు సరిహద్దులను మూసేయడానికి గోడను నిర్మించిన సంగతి తెల్సిందే. ఈ సంఘటన అప్పట్లో సంచలనం అయింది. ఈ సంఘటన మరువకముందే మరో సంఘటన జరిగింది.

తాజాగా ఏపీ ప్రజలు తమ రాష్ట్రంలోకి ప్రవేశించకూడదంటూ తమిళనాడు అధికారులు జేసీబీ సాయంతో ఏపీకి, తమ రాష్ట్రానికి మధ్య సరిహద్దుల్లో రోడ్డుకు అడ్డుగా భారీ గొయ్యి తవ్వారు. చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలోనే తమిళనాడు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. తమిళ అధికారులు చేసిన ఈ నిర్వాకంపై ఏపీ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.