కరోనాకు మందు కనిపెట్టాడు..పోలీసులు సన్మానించారు! - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాకు మందు కనిపెట్టాడు..పోలీసులు సన్మానించారు!

May 8, 2020

Tamil Nadu police arrest man who claimed to have found cure for Covid-19

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ లేకపోవడం భయాన్ని రెట్టింపు చేస్తోంది. ఈ వైరస్ కు వ్యాక్సిన్‌ కనిపెట్టడానికి కనీసం ఇంకో సంవత్సరం అయినా పడుతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొంది. ఈ వైరస్‌కి వ్యాక్సిన్‌ కనిపెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు. 

ఇదిలా ఉంటే తమిళనాడుకు చెందిన తనికశాలమ్‌ అనే వ్యక్తి మాత్రం తాను కరోనాకి ఆయుర్వేదిక్‌ మందు కనిపెట్టానని… తాను కనిపెట్టిన మందు వాడితే 48 గంటల్లో కరోనా వ్యాధి సోకిన వ్యక్తి మాములు మనిషి అవుతాడని, లండన్‌కు చెందిన ఓ వ్యక్తికి తాను చికిత్స చేసి కరోనా నుంచి రక్షించానని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు. అగతియార్‌, పోగర్‌లాంటి సిద్దులు కూడా ఎలాంటి చదువు లేకుండానే అనేక వైద్య విధానాలు కనుగొన్నారని, చదువుకు మందు కనిపెట్టడానికి సంబంధం లేదని సోషల్ మీడియాలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నాడు. ఈ విషయం ఇండియన్‌ మెడిసన్‌ అండ్‌ హోమియోపతికి తెలియడంతో దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనికశాలమ్‌ అనే వ్యక్తి సోషల్‌ మీడియా ద్వారా కరోనా నియంత్రణకు మందు కనిపెట్టానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తనికశాలమ్‌ కోయాంబేడు బస్టాం‍డ్‌ సమీపంలో ఎలాంటి అనుమతులు, అర్హత లేకుండా ఆయుర్వేద ఆసుపత్రిని నడుపుతున్నాడు. దీనికి తోడు కరోనా వ్యాధికి సంబంధించి 70 కిపైగా వీడియోలను సోషల్ మీడియా‌లో షేర్ చేశాడు. పోలీసులు తనికశాలమ్‌ ను అరెస్ట్ చేసి డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 54 కింద కేసు నమోదు చేశారు.