కమల్ హాసన్‌పై చెప్పులతో దాడి - MicTv.in - Telugu News
mictv telugu

కమల్ హాసన్‌పై చెప్పులతో దాడి

May 16, 2019

ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం వ్యవస్థాపకుడు కమల్‌ హాసన్‌‌కు ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. కమల్‌ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా కొందరు వ్యక్తులు ఆయనపైకి చెప్పులు విసిరారు. కమల్ బుధవారం మదురై అసెంబ్లీ నియోజకర్గపరిధిలోని తిరుప్పరాన్‌కుంద్రమ్‌లో ఎన్నికల ర్యాలీ చేపట్టారు.

Tamil Nadu Slippers thrown at Kamal Haasan during election meeting, say reports.

కమల్‌ ప్రసంగిస్తుండగా కొందరు వ్యక్తులు ఆయనపైకి చెప్పులు విసిరారు. ఈ ఘటనపై కమల్‌ అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ అభిమానులు మొత్తం 11 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిలో భాజపా నేతలు, హనుమాన్‌ సేన సభ్యులు కూడా ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన ఓ ప్రచార కార్యక్రమంలో కమల్ ప్రసంగిస్తూ ‘స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది ఓ హిందువు. ఆయన పేరు నాథూరామ్‌ గాడ్సే’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో తీవ్ర దుమారానికి దారితీశాయి. కమల్‌పై కేసు కూడా నమోదైంది. దీంతో ఆయన మద్రాసు హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై న్యాయస్థానం గురువారం విచారణ జరపనుంది.