టిక్‌టాక్ కోసం పిల్లికి ఉరి.. తంగదురై, ఏమి వా చేస్తివి?  - MicTv.in - Telugu News
mictv telugu

టిక్‌టాక్ కోసం పిల్లికి ఉరి.. తంగదురై, ఏమి వా చేస్తివి? 

May 23, 2020

cattt

పిల్లిని చంపితే మహా పాతకం చుట్టుకుంటుందని పెద్దలు అంటారు. ఆ సంగతి తెలియక ఓ కుర్రాడు టిక్‌టాక్ పిచ్చితో ఘాతుకానికి పాల్పడ్డాడు. లైకులు, కామెంట్లు, ఎక్కువ రావాలని పెంపుడు పిల్లిని నిర్దాక్షిణ్యంగా ఉరితీశాడు. ఈ ఘోరాన్ని వీడియో తీసి యాప్‌లో పెట్టాడు. అది కాస్తా వైరల్ కావడతో పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా చెట్టికుళానికి చెంది తంగదురై అనే టీనేజర్ కు టిక్ టాక్ పిచ్చి పీక్స్ కు చేరింది. లైకుల కోసం వెర్రివేషాలు వేస్తున్నాడు. అవి ఫలించకపోవడంతో పిల్లికి ఉరిపోశాడు. దాని మెడకు తాడు కట్టి దూలానికి వేలాదీశాడు. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో జంతుహక్కుల కార్యకర్తలలు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్షణం ఆలస్యం చెయ్యకుండా అతన్ని పట్టుకుని జైల్లోకి నెట్టారు. జంతుహింస, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. టిక్ టాక్ లో ఇటీవల అభ్యంతరకర వీడియోలు, ఆడియో సంభాషణలు జోరందుకున్నాయి. పచ్చిబూతులతో ఆడవాళ్లు కూడా వీడియోలు చేస్తున్నారు. వినోదం కాస్తా వికటించి చిక్కుల్లో పడుతున్నారు.