Tamil Nadu Temple Celebrates Elephant’s Birthday, Anand Mahindra Shares Clip
mictv telugu

‘అఖిల’ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

June 12, 2022

Tamil Nadu Temple Celebrates Elephant’s Birthday, Anand Mahindra Shares Clip

పుట్టిన రోజు అంటే ప్రతీ ఒక్కరికే ప్రత్యేకమే. ఆ రోజున కొత్త బట్టలు, కేక్ కటింగ్‌లు, పార్టీలు.. ఇదంతా చాలామంది జరుపుకునే వేడుకలు. కొందరు తమ ఇళ్లలో పెంచుకొనే పెంపుడు జంతువులకు కూడా పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తుంటారు. తమిళనాడులోని ఓ ఆలయంలో అఖిల అనే ఏనుగుకు స్థానికులు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.

ఆలయ ప్రాంగణంలో పెద్ద ప్లేట్ లో పలు రకాల పండ్లను ఉంచారు. ఏనుగును ముస్తాబు చేసి తీసుకొచ్చారు. అయితే ఆ ఏనుగు సంతోషంగా ఆ పండ్లను ఒక్కొక్కటి తింటూ.. చాలా బాగుందంటూ తల ఊపటం కనిపించింది. ఏనుగు నవ్వుతెప్పించే చేష్టలతో ఉన్న వీడియోను మహింద్రా అండ్ మహింద్ర కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.

“తమను తాము సంతోషపరుచుకోవాలని భావించే వారికి ఇదొక మంచి క్లిప్’’అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఏనుగు తనకు ప్రసాదంగా పెట్టిన వివిధ రకాల పండ్లను రుచిచూస్తూ సంతోషంగా తలాడించడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది.