నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ఓ మహిళను ఢీకొట్టిన ఆర్టీసీ డ్రైవర్‌ను ప్రశ్నించినందుకు స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌పై అకారణంగా చేయి చేసుకున్నాడో ట్రాఫిక్ కానిస్టేబుల్. తప్పు చేసిన బస్సు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఏ పాపం తెలియని స్విగ్గీ డెలివరీ బాయ్‌పై అకారణంగా కొట్టాడు. తమిళనాడులోని కోయంబత్తూర్ అవినాషి రోడ్డులో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. స్విగ్గీ ఏజెంట్ మోహన్ సుందరం ఫుడ్ డెలివరీ చేయడానికి వెళుతున్న సమయంలో.. రోడ్డు దాటుతున్న ఓ మహిళను స్కూల్ బస్సు డ్రైవర్ ఢీకొట్టాడు. ఆ మహిళ భుజానికి గాయమైంది. అయినా ఆ బస్సు డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడు. దీంతో మోహన్ ఆ బస్‌ను ఛేజ్ చేసి డ్రైవర్‌ను పట్టుకున్నాడు. రోడ్డు మీద ఆపి ఆ బస్ డ్రైవర్‌తో గొడవపడ్డాడు.
"This happened yesterday evening at the fun mall signal and there was a slight traffic block due to this delivery boy and all of a sudden this Cop Started beating up the Delivery person "
. #welovecovai
.
👉 IG : FB :TW @WELOVECOVAI
.#coimbatore #delivery #deliveryboy #traffic pic.twitter.com/OBEwmghc1R— We Love Covai ❤️ (@welovecovai) June 4, 2022
ఆ సమయంలో అక్కడ డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సతీష్ అక్కడకు చేరుకున్నాడు. ఫుడ్ డెలివరీ ఏజెంట్ మోహన సుందరం చెంపపై పలు మార్లు కొట్టాడు. ఈ స్కూల్ బస్సు యజమాని ఎవరో తెలుసా? అని ప్రశ్నించాడు. ఆ బస్సుకు సంబంధించి ఏమైనా ట్రాఫిక్ సమస్యలు ఉంటే తామే చూస్తామని అన్నాడు. అనంతరం ఫుడ్ డెలివరీ ఏజెంట్ మొబైల్ ఫోన్, బైక్ తాళాలను బలవంతంగా తీసుకుని అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయాడు. బిత్తరపోయిన మోహన్ ఆ కానిస్టేబుల్‌కు సారీ చెప్పి అక్కణ్నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన మొత్తాన్ని ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనంతరం మోహన్, నగర పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశాడు. కమిషనర్ విచారణకు ఆదేశించారు. కానిస్టేబుల్ సతీష్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు.