మనుస్మృతి దుర్మార్గమంటూ.. బుక్‌లెట్లను పంచుతున్న పార్టీ - MicTv.in - Telugu News
mictv telugu

మనుస్మృతి దుర్మార్గమంటూ.. బుక్‌లెట్లను పంచుతున్న పార్టీ

November 8, 2022

మనుస్మృతి దళితులపై, శూద్రులపై స్త్రీలపై వివక్ష చూపుతోందని విమర్శలు ఉన్నాయి. భారత కుల వ్యవస్థకు ఇదే మూలమని కొన్ని సంఘాలు దీన్ని తరచూ కాల్చేస్తుంటాయి. అయితే తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ పార్టీ మనుస్మృతి జనానికి పంచిపెడుతూ సరికొత్త పోరాటానికి తెరతీసింది. అంటరానితనాన్ని, స్త్రీలపై వివక్షను ప్రోత్సహించే మనుస్మృతిని పాటించకూడదంటూ విడుదలై చిరుతైగల్ కచ్చి(వీసీకే) పార్టీ బుక్‌లెట్లను పంచిపెడుతోంది. 32 పేజీలున్న ఈ పుస్తకంలో వివక్షకు సంబంధించిన అంశాలను ముద్రించారు.

‘చాలామంది అన్నీ తెలిసినా ఇప్పుడు మనుస్మృతిని ఎవరు పాటిస్తున్నారు అని అమాయకంగా అడుగుతున్నారు. కొందరికి నిజంగానే అందులో ఏముందో తెలియదు. హిందూ సమాజం దీనిపై నిర్మితమైనదే. అంబేద్కర్ రూపొందించిన రాజ్యంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని మనువు సూత్రాలు చట్టాలుగా చలామణి అవుతున్నాయి’ అని పేర్కొన్నారు. ‘‘భర్త నిద్రపోయేక భార్య నిద్రపోయి, అతడు లేవకముందే నిద్ర లేవాలి. ఇతర పురుషులను కామించకూడదు. అప్పుడు మాత్రమే ఆమె పవిత్రురాలు. సూర్యోదయానికి ముందే ఆమె గోమూత్రంలో ఇల్లు శుద్ధి చేసుకోవాలి. భర్త వదిలేసిన తిండిని మహాప్రసాదంగా స్వీకరించాలి. శూద్రులు తమ ఇంటి అవసరాలకు మించిన ధనాన్ని కూడబెట్టకూడదు. బ్రాహ్మణ స్త్రీని బ్రాహ్మణేతరుడు కోరుకుంటే మరణశిక్ష వేయాలి. శూద్రులకు విద్య బోధించకూడదు’ అని మనుస్మృతిలో ఉన్నట్లు ఈ బుక్ లెట్లో పేర్కొన్నారు.