నోట్ల కాటు.. అక్కడ లోక్‌సభ ఎన్నికలు రద్దు - MicTv.in - Telugu News
mictv telugu

నోట్ల కాటు.. అక్కడ లోక్‌సభ ఎన్నికలు రద్దు

April 16, 2019

సార్వత్రిక ఎన్నికల్లో డబ్బుకట్టలు కలకలం రేపుతున్నాయి. దాదాపు అన్ని బడా పార్టీలూ డబ్బుల పంపకాల్లో మునిగి తేలుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో కోట్ల రూపాయలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులోని వెల్లూరు లోక్‌సభ స్థానం ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది.

Tamil nadu Vellore lok sabha constituency polls cancelled Money used cash seized to influence voters president accepted Election commission recommendation

అక్కడ లెక్కాపత్రాలు లేదని డబ్బు కోట్లలో దొరుకుతోంది. డీఎంకే అభ్యర్థి కదిర్‌ ఆనంద్‌ నుంచి రూ. 11 కోట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఎంకే ఆఫీసుల్లోనూ డబ్బు, మద్యం వగైరా దొరికాయి. ఇతర పార్టీల అనుచరులు కూడా డబ్బులు తరలిస్తూ దొరికారు. దీంతో అక్కడ ఎన్నికలు పారదర్శకంగా జరగవని, రద్దు చేసి కొంత వ్యవధి తర్వాత నిర్వహించాలని డిమాండ్లు వచ్చాయి. దీనికి తోడు, ఆనంద్‌ తన  అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఆయనను అరెస్ట్ చేస్తారని, సానుభూతితో గెలిచేస్తారని కూడా అన్నాడీఎంకే వర్గాలు ప్రచారం చేశాయి. పరిస్థితి గమనించిన ఎన్నికల సంఘం అక్కడ ఈ నెల 18న జరగాల్సిన పోలింగ్‌ను రద్దు చేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కోరింది. దీనికి ఆయన ఈ రోజు ఆమోదం తెలిపారు.