గల్లీ నుంచి నుంచి ఢిల్లీ దాకా రైతులు ఆందోళన చేసినా కనిపించలేదు..వాళ్లు గోడు తమిళనాడు సర్కార్ వినిపించలేదు. ఢిల్లీ వీధుల్లో అర్థనగ్న ప్రదర్శనలు చేసినా కేంద్రమూ పట్టించుకోలేదు..కానీ ఇప్పుడు తమిళనాడు ఎమ్మెల్యేల సాలరీలు మాత్రం హ్యాండ్రెడ్ పర్సెంట్ హైక్ అయ్యాయి.
తమిళనాడు ఎమ్మెల్యేలు బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల జీతాలను ఏకంగా నూరు శాతం పెంచేశారు. ప్రస్తుతం రూ.50 వేల నెల జీతం ఉన్న ఎమ్మెల్యేలు ఇక నుంచి లక్షా అయిదు వేలు తీసుకుంటారు. అంటే నెల జీతం ఏకంగా రూ.50 వేలు పెరిగింది. ఎమ్మెల్యేల పెన్షన్ కూడా పెరిగింది. ఎమ్మెల్యేల పెన్షన్‌ను రూ.12 వేల నుంచి రూ.20 వేలకు పెంచేశారు. అసెంబ్లీ నియోజకవర్గ ఫండ్‌ను కూడా రెండు కోట్ల నుంచి 2.6 కోట్లకు పెంచారు. ఎమ్మెల్యేల జీతాలు పెంచుతున్నట్లు తమిళనాడు అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి ప్రకటించారు.