ఆయన కన్నేస్తే కటకటాల్లోకే..! - MicTv.in - Telugu News
mictv telugu

ఆయన కన్నేస్తే కటకటాల్లోకే..!

July 6, 2017

టైటిల్ చూస్తే ఆయన అంత మొనగాడా అని అనిపిస్తుంది. అవును..ఆయన అంతకన్నా ఎక్కువే. ఆయన ఎవరిపై కేసు వేసినా కటకటాల్లోకి వెళ్లాల్సిందే. ఏదో మామూలుగా ఆరోపణలు చేసి వదిలేయరు..వాటిని నిరూపించేదాకా పట్టువదలని విక్రమార్కుడు. వదల బొమ్మాలి నిన్నొదల అంటూ తను వేసిన కేసుల్ని తానే శోధించి వాదించి సాధిస్తారు. ఆయనే వన్ అండ్ ఓన్లీ స్వామి..సుబ్ర‌మ‌ణ్య‌స్వామి..సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకముందే కేక పెట్టిస్తున్నారు. రాజకీయాల్లోకి వస్తే కాలాకు కేసులు తప్పవా..?జైలుకు వెళ్లేదాకా వదలరా..?అస్సలు రజనీ చేసిన తప్పు ఏంటీ..?సుబ్రమణ్య స్వామి దగ్గర ఆధారాలేంటీ..?

బీజేపీ ఎంపీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి టార్గెట్ ఇప్పుడు రజనీకాంత్. రాజకీయాల్లోకి వస్తే అట్టర్ ప్లాప్ అవుతాడన్న స్వామి..లేటెస్ట్ గా 420 అని కామెంట్ చేశారు. ర‌జ‌నీ అమెరికాలోని ఓ కాసినోలో గ్యాంబ్లింగ్ ఆడుతున్న ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఆరోగ్యాన్ని మెరుగు ప‌ర‌చుకోవ‌డం కోసం ఆర్కే 420 గ్యాంబ్లింగ్ ఆడుతున్నాడా? అత‌నికి ఈ డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో ఈడీ విచార‌ణ జ‌ర‌పాలి అని స్వామి డిమాండ్ చేశారు. ఇప్పుడే కాదు ఇంతకు ముందు ఆరోపణలు చేస్తూ ర‌జ‌నీ అస‌లు త‌మిళియ‌నే కాద‌ని, అత‌ను రాజ‌కీయాల్లోకి వ‌స్తే అట్ట‌ర్ ఫ్లాప్ అవుతాడ‌ని స్వామి విమ‌ర్శించారు. త‌మిళ‌నాడు సీఎం కావ‌డానికి ర‌జ‌నీ ఏమాత్రం స‌రితూగ‌డు అని స్ప‌ష్టంచేశారు.

స్వామి చేసిన ఆరోపణల్ని ఎవరూ లైట్ తీసుకోరు. ఆ మాటల్లో నిజం ఉందని జనం నమ్ముతారు. అందుకే నేతలు సుబ్రమణ్యస్వామి చేసిన ఆరోపణలపై కౌంటర్ ఇవ్వడానికి సహసించరు. తప్పని పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చినా బాగా స్టడీ చేసి ఇస్తారు. అసలే రాజకీయ అనుభవం లేని కాలా..అడుగు వేయకముందు ఆడుకుంటున్నారు.వదల బొమ్మాళి అంటూ నెలకో ఆరోపణ చేస్తూ దడ పుట్టిస్తున్నారు. ఇన్ని ఆరోపణలు చేస్తున్నా రజనీ కాంత్ ఇప్పటివరకు స్పందించలేదు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ స్వామిని కెలికే ప్రయత్నం చేయడం లేదు. చేయలేరు కూడా..ఎందుకంటే రెచ్చిగొడితే రచ్చ రచ్చే.పోయి పోయి కందరీగల తేట్టెను కదపడం ఎందుకు అనుకుంటున్నారేమో…కామెంట్లని ఖండించే సాహసం చేయలేకపోతున్నారు..

సుబ్రమణ్య స్వామి అల్లర చిల్లర ఆరోపణలు అస్సలు చేయరు. ఆయన నోటి నుంచి వచ్చిదంటే కాగితాల ఆధారాలు ఉండే ఉంటాయి. ఇంతవరకు కేసులు అన్ని ఇలాగే ఉన్నాయి. తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కటకటాల్లోకి పంపి చుక్కులు చూపించారు. అదే కేసులో శశికళను ఊచలు లెక్కి పెట్టించారు. 2జీ స్పెక్ట్రమ్ కేసులో మారన్ , కనిమొళిల్ని ముప్పతిప్పలు పెట్టించారు. ఇలా ఏ కేసు చూసినా స్వామిదే పై చేయి..

ఇప్పుడు ఈ ఆరోపణలకు కాలా ఏం ఆన్సారిస్తాడో చూడాలి. రాజకీయాల్లోకి రాక ముందే సెగ ఇలా ఉంటే వచ్చాక..ఎలా ఉంటుందో ఉహించడమే కష్టం.స్వామితో పెంట ఎందుకుని రోబో సైలెంట్ గా ఉంటాడా..సినిమాల్లో గెలుపు లాగా చివరకు హీరో దే గెలుపు అని ముందుడుగు వేస్తారా. రియల్ సినిమాలో ఇప్పుడు విలన్ సుబ్రమణ్యస్వామి..హీరో రజనీకాంత్…ఫ్యూచర్ లో ఎవరు..?వీళ్లు ఇలాగే ఉంటారా..తారుమారు అవుతారా..ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. రజనీ..వందసార్లు కాదు..స్వామి మాటలపై ఒక్కసారి మాట్లాడు…జనానికి క్లారిటీ ఇవ్వు.. లేదంటే ఆయన అలానే చేస్తూ పోతుంటారు. స్లో ఫాయిజన్ లాగా సూపర్ స్టార్ ఇమేజ్ కే డ్యామేజ్ రావొచ్చు. సో బీ కేర్ ఫుల్ కాలా…