సీఎం కేసీఆర్‌ను కలిసిన తమిళ స్టార్ ఇళయ దళపతి విజయ్ - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం కేసీఆర్‌ను కలిసిన తమిళ స్టార్ ఇళయ దళపతి విజయ్

May 18, 2022

తమిళ సినిమా స్టార్ నటుడు, ఇళయ దళపతి విజయ్ బుధవారం సాయంత్రం తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ విజయ్‌ను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఇద్దరూ కాసేపు చర్చించుకున్నారు.

మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగిందని తెలుస్తోంది. కాగా, విజయ్ నటించిన బీస్ట్ చిత్రం ఇటీవల రిలీజై డివైడ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం విజయ్ దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.