కాజల్ గా మారిన సరోజ..! - MicTv.in - Telugu News
mictv telugu

కాజల్ గా మారిన సరోజ..!

September 13, 2017

ఎవరు ఈ సరోజ..ఆమె కాజల్ గా మారుడేంది అని పరేషాన్ అయితున్నరు గదా. అంతా తమిళనాడు ప్రభుత్వ అధికారుల పుణ్యమే. తమిళనాడు ప్రభుత్వం అక్కడి కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తుంది. అయితే ఆ స్మార్ట్‌ రేషన్‌కార్డులో కుటుంబ యాజమాని ఫోటో స్థానంలో హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ఫోటో దర్శనమిచ్చింది. ఆమె పేరు సరోజ. అయితే తనకు తమిళ ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డ్ లో ఫోటో చూసి ఒక్కసారి అవాక్కయ్యింది. వెంటనే అధికారులకు దగ్గరకు వెళ్లగా పొరపాటులో వచ్చింది. మార్చి మళ్లీ ఇస్తామని చెప్పారట. గతంలో కూడా  పురుషుల పేరు స్థానంలో మహిళల పేరు, ఫోటోలు మార్పులు అక్కడక్కడ చోటు చేసుకున్నాయి. ఈ తప్పిదాలను తొలగించటానికి ఎన్నికల కమిషన్‌ ప్రతిసారి చర్యలు తీసుకుంటూ వస్తుందట.