Home > రాజకీయం > కమల్ హాసన్  మళ్లీ ట్విట్టాడు..!

కమల్ హాసన్  మళ్లీ ట్విట్టాడు..!

చూస్తుంటే కమల్ హాసన్ ట్విట్టర్ నే తన ఆయుధంగా చేస్కున్నట్టు తెలుస్తుంది,తమిళనాడు ప్రభుత్వంపై సప్ సప్ మని ట్విట్టర్ బాణాలు ఒకటి తర్వాత ఒకటి వదులుతునే వున్నాడు,మొన్నేమో తమిళనాడు ప్రభుత్వంలున్న అన్ని శాఖల్లో అవినీతి పెరిగిపోయిందని చెప్పాడు..నిన్నేమో నేనే సియం అని ధీమా వ్యక్తం చేసాడు,ఇప్పుడు తాజాగా తమిళనాడులో ప్రబలుతున్న డెంగూ జ్వరాలను నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, లేకపోతే అధికారం నుంచి తప్పుకోవాలని కొంచెం ఘూటుగానే డిమాండ్ చేశాడు.ఒకప్పుడు ఈ డెంగ్యూ జ్వరానికి నాకూతురు బలైపోయి ఉండేది,అదృష్టం బాగుండి బతికింది, చర్యలు తీసుకుంటారా..?తప్పుకుంటారా ?చెప్పండి అని తమిళనాడు ప్రభుత్వానికి సవాల్ విసిరాడు.దీనిపై స్పందించిన ఏఐఏడీఎంకే నేతలు కమల్‌కి రాజకీయాల్లోకి వచ్చే దమ్ముందా అని తిరిగి కామెంట్లు చేశారు.మొత్తానికి అటు తమిళనాడు ప్రభుత్వానికి.. ఇటు కమల్ హాసన్ కి మద్య మాటల యుద్దానికి ట్విట్టర్ వేదికైందన్న మాట.

Updated : 21 July 2017 2:26 AM GMT
Tags:    
Next Story
Share it
Top