శ్వేతనాగు దొరికింది....! - MicTv.in - Telugu News
mictv telugu

శ్వేతనాగు దొరికింది….!

July 29, 2017

మీకు సౌందర్య నటించిన శ్వేతనాగు సినిమా గుర్తుందా?అందులో శ్వేతనాగు మొత్తం తెల్లగా ఉంటుందని గ్రాఫిక్స్ లో చూపించారు.నిజంగా శ్వేతనాగు తెల్లగా ఉంటుందా?దాని విషం అత్యంత పవర్ ఫుల్ ఆ?ఏమో మరి..

తాజాగా తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లా వూండి అటవి ప్రాంతంలో.. శ్వేతనాగు కనిపించిందట. ఆ శ్వేతనాగును అటవీ సిబ్బంది పట్టుకొని గిండిలోని చిల్ర్టన్ పార్కు కు తలిరించారట.ఆ అరుదైన శ్వేతనాగును చూసేందుకు సందర్శకులు ఉత్సాహం చూపుతున్నారని పార్కు నిర్వహకులు చెప్తున్నారు. సాధారణంగా పాము కళ్లు నలుపు రంగులో ఉంటాయి, కానీ శ్వేతనాగు కళ్లు ఎరుపు రంగులో ఉన్నాయట.దాని కలర్ కూడా డిఫరెంట్ గా ఉందట.

పాములను కొందరు దేవతా మూర్తులుగా పాలు పోసి పూజిస్తారు.మరి కొందరు పాములు దేవతలు కావు అవి కేవలం విష సర్ఫాలు మాత్రమే అంటారు. పాములు పాలను తాగవు వాటికి చెవులు కూడా వినబడవు అని మరికొందరంటారు. పాములను కొన్ని దేశాలలో ఆహారంగా తీసుకుంటారు కూడా. ఇలా ఎవరి వాదన ఎలా ఉన్నా..పాములలో అరుదైన పాములు రెండు మాత్రమేనట. ఒకటి వాసుకీ కాగా, రెండవది శ్వేతనాగు.మరి ఆ దొరికిన అరుదైన పాము నిజంగా శ్వేతనాగా కాదా అన్నది…తెలియాల్సివుంది.