తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం
తెలంగాణ రాష్ట్ర రెండవ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసిన ఆమె.. ఈరోజు ఉదయం 11.00 గంటలకు తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్… రాజ్‌భవన్‌లో ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమాంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి డిప్యూటి ఛైర్మన్ నేతి విద్యాసాగర్, హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, హరీశ్‌రావు, కేటీఆర్, ఎంపీ సంతోష్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, సీఎస్ ఎస్ కే జోషీ, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండగా.. బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే ఆమె మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పటికే ప్రభుత్వం సౌందరరాజన్‌కు అందించింది.