తమిళనాడు పోలీసుల మరో దాష్టికం.. దెబ్బలకు ఆటో డ్రైవర్ మృతి - MicTv.in - Telugu News
mictv telugu

తమిళనాడు పోలీసుల మరో దాష్టికం.. దెబ్బలకు ఆటో డ్రైవర్ మృతి

June 28, 2020

Auto Driver.

తమిళనాడులోని ట్యుటికోరన్‌లోని సెల్ షాపు యజమానుల లాకప్ డెత్ మర్చిపోక ముందే అక్కడి పోలీసులు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ ఆటో డ్రైవర్‌ను కేసు పేరుతో విపరీతంగా కొట్టడంతో మరణించాడు. తిరునల్వేలి ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అతడి బంధువులు పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వరుసగా లాకప్ డెత్‌లోకి వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు వారి తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. 

ఎన్.కుమరేశన్ అనే ఆటో డ్రైవర్‌ను భూ వివాదం కేసులో పదిహేను రోజుల క్రితం అరెస్టు చేశారు. అతన్ని స్టేషన్‌లో పెట్టి లాఠీలతో చితక బాదారు. ఆ తర్వాత రోజు ఇంటికి పంపించారు. గాయలతో ఇంటికి వచ్చిన అతడు రక్తపు వాంతులు చేసుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు తిరునల్వేలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ పదిహేను రోజులుగా చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మరణించాడు. ఈ ఘటన అతని కుటుంబంలో విషాదం నింపింది. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు రాష్ట్రవ్యాప్త సంచలనం రేపాయి. దీంతో ఉన్నతాధికారులు పోలీసులపై కేసు నమోదు చేసి దర్యాప్తునకు ఆదేశించారు.