ప్రభుత్వానికి రూ. 55 లక్షలు దానం చేసిన బిచ్చగాడు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభుత్వానికి రూ. 55 లక్షలు దానం చేసిన బిచ్చగాడు

July 26, 2022

అయినవాళ్లంటూ ఎవరూ లేక పొట్ట నింపుకోవడానికి గత 12 ఏండ్లుగా భిక్షాటన చేస్తున్న ఓ వృద్ధుడు.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తాను భిక్షాటన చేయగా వచ్చిన సొమ్ము.. పదిమందికి ఉపయోగపడాలని ఆ డబ్బును సీఎం సహాయనిధికి అందిస్తున్నాడు. అలా ఇప్పటి వరకూ ఏకంగా రూ.55.60 లక్షలను వివిధ సందర్భాల్లో పలు జిల్లాల కలెక్టర్లకు అందజేశాడు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా ఆలంగెనరు ప్రాంతానికి చెందిన పూల్‌పాండి(72) భిక్షగాడిగా జీవిస్తున్నాడు.

సోమవారం వేలూరు కలెక్టరేట్‌లో జరుగుతున్న గ్రీవెన్‌సెల్‌కు వచ్చాడు. తన వద్ద ఉన్న రూ. 10 వేలు నగదును ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వాలంటూ, శ్రీలంక తమిళులకు ఉపయోగపడేలా వాటిని ఖర్చు చేయాలని కోరుతూ కలెక్టర్‌ కుమరవేల్‌ పాండియన్‌కు అందజేశారు. అనంతరం పూల్‌ పాండి మాట్లాడుతూ.. తాను పన్నెండేళ్లుగా భిక్షాటన చేస్తున్నానని, దాని ద్వారా వచ్చిన డబ్బుతో ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, కుర్చీలు, టేబుళ్లు కొనుగోలు చేసి ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఇలా రూ.50.60 లక్షలు విలువ చేసే వస్తువులు, సొమ్మును విరాళంగా పలు సందర్భాల్లో అందజేసినట్లు చెప్పాడు.