తెగించేశాడు.. ఓటర్లకు స్వయంగా డబ్బు పంచిన సీఎం - MicTv.in - Telugu News
mictv telugu

తెగించేశాడు.. ఓటర్లకు స్వయంగా డబ్బు పంచిన సీఎం

April 17, 2019

ఎన్నికల కోడ్ నాలుక గీసుకోడానికి కూడా పనికిరాకుండో పోతోంది. నిబంధనలు నిబంధనలే, ఉల్లంఘనలు ఉల్లంఘనలే. పార్టీల కార్యాకర్తలు, కిరాయి రౌడీలేకాదు, ఏకంగా గౌరవనీయ పదవుల్లో ఉన్న నేతలు సైతం బరితెగించేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత పళనిస్వామి ఓటర్లకు స్వయంగా డబ్బులు పంచారు.

మంగళవారం రెండోవిడత ఎన్నికల ప్రచారం ముగిశాక ఆయన సేలంలో ఓ పండ్ల మార్కెట్‌కు వెళ్లాడు. నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం చేయడమే కాకుండా డబ్బులు కూడా పందేరం చేశారు. ఓ మహిళ.. ఏకంగా ముఖ్యమంత్రే తన వద్దకు ఓట్లు అడుక్కోడానికి వచ్చాడని సంబరంతో ఆయనకు అరటిపళ్లు ఇచ్చింది. అవి పుచ్చుకున్న పళని.. కరపత్రంలో డబ్బులు పెట్టి ఆమెకు ఇచ్చాడు. పామ పార్టీ అభ్యర్థికే ఓటేయాలని కోరాడు. ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏకంగా ముఖ్యమంత్రే డబ్బులు పంచితే ఇక నిబంధనలు ఎంత చక్కగా అమలవుతున్నాయో అర్థం చేసుకోవచ్చని విపక్షాలు మండిపడుతున్నాయి. తమిళనాడు ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడం దశాబ్దాల కిందటే మొదలైంది. ఉచిత మిక్సీలు, టీవీలు, గ్రైండర్లతో హల్ చల్ చేస్తుంటారు. వాటి పంపకం ‘భారం’ కావడంతో తిరిగి నోట్లనే పంచేస్తున్నారు. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల్లో కోట్లాది డబ్బుగుట్టలు పలుగుతున్నాయి. దీంతో వేలూరు స్థానంలో ఎన్నికను ఈసీ రద్దు చేసింది.