శశికళ,దినకరన్ కు ఊస్టింగ్..? పన్నీర్ సెల్వంకు పోస్టింగ్..? - MicTv.in - Telugu News
mictv telugu

శశికళ,దినకరన్ కు ఊస్టింగ్..? పన్నీర్ సెల్వంకు పోస్టింగ్..?

August 10, 2017

తమిళ రాజకీయాల్లో మళ్లీ సెగ మెదలైంది. మున్నారుగుడి మాఫియాకు చెక్ పెట్టేందుకు ఏఐఏడీఎంకే నాయకులు రంగం సిద్దం చేస్తున్నారు. దివంగత సీఎం జయలలిత నమ్మినబంటు అయిన పన్నీరు సెల్వంకు ఆర్థికశాఖ, ఉపముఖ్యమంత్రి పదవిని పళనిస్వామి వర్గం ఇవ్వనున్నట్టు సమాచారం. దీనితో సాధ్యమైనంత త్వరలోనే పళని, పన్నీరు రెండు వర్గాలు విలీనం కాబోతున్నట్టు ఏఐఏడీఎంకే వర్గాలు వెల్లడించాయి. దానితో పాటు పార్టీ చీఫ్ గా ఉన్న శశికళ, డిప్యూటీ చీఫ్ గా ఉన్న దినకరన్ ను పదవుల నుంచి తొలగించేందుకు రంగం సిద్దమైనట్టు సమాచారం. ఆగస్టు 15 కంటే ముందే విలీనం ఉంటుందని మంత్రి డి.జయకుమార్ తెలిపారు. పన్నీరుసెల్వం కు ఉపముఖ్యమంత్రి పదవి పై జయకుమార్ నోరు విప్పలేదు. కానీ పన్నీర్ అనుచరులు సెమ్ములై, పాండియరాజన్ లు కూడా తమకు మంత్రి పదవులు ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్టు తెలిపారు. అయితే కేబినేట్ లో ఈ ఇద్దరికి స్థానం కల్పిస్తే మంత్రులు సంపత్, విజయ్ భాస్కర్ లను కేబినేట్ నుంచి బయటకు పంపే అవకాశాలు ఉన్నాయి.ఇప్పటికే పళనిస్వామి వర్గం ఏఐఏడీఎంకే డిప్యూటీ చీఫ్ గా దినకరన్ నియామకం చెల్లదంటు తీర్మానం చేశారు.