పోర్న్ చూస్తున్న 600 మందిపై కేసు నమోదు - MicTv.in - Telugu News
mictv telugu

పోర్న్ చూస్తున్న 600 మందిపై కేసు నమోదు

February 27, 2020

fgbcgbh

దేశంలో మహిళలపై, చిన్నారులపై పెరుగుతున్న అత్యాచారాలకు మద్యంతోపాటు, పోర్న్ వీడియోలు కూడా కారణం. అందుకే భారత ప్రభుత్వం పోర్న్ సైట్లపై నిషేధం విధించింది. అయినా కోట్ల మంది పక్కదారుల్లో వాటిని చూస్తూనే ఉన్నారు. అంతకంటే దుర్మార్గం ఏంటంటే.. పిల్లలతో చేయించిన అశ్లీల వీడియోలను పెద్దసంఖ్యలో చూస్తుండం. 

దీనికి అడ్డుకట్ట వేసేందుకు తమిళనాడు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పోర్న్ చూస్తున్న మూడు వేల మందిని పోలీసులు గుర్తించారు. చైల్డ్ పోర్న్ కంటెంట్‌ను తమిళనాడులో భారీగా చూస్తున్నట్లు, డౌన్ లోడ్ చేసుకుంటున్నట్లు అమెరికా సైబర్ నిఘా వర్గాలు తమిళనాడు పోలీసులకు తెలిపాయి.  తాజాగా అశ్లీల వీడియోలను వీక్షించిన 600 మందిపై చెన్నై పోలీసులు కేసులు పెట్టారు. దీంతో వీరంతా అరెస్టు కానున్నారు. ఇంటర్నెట్‌లో బాల, బాలికల అశ్లీల వీడియోలను చూసేవారిని అరెస్టు చేసేందుకు పోలీసులు నిర్ణయించారు. దీంతో మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణ విభాగం అడిషనల్‌ డీజీపీ రవి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అశ్లీల వీడియోలను చూసే వారి జాబితాను పోలీసు అధికారులు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి 600 మంది పేర్లు, వివరాలను సేకరించారు. దీన్ని చెన్నై, ఇతర జిల్లాల పోలీసు అధికారులకు పంపి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.