తమిళనాట మరో ట్విస్ట్... - MicTv.in - Telugu News
mictv telugu

తమిళనాట మరో ట్విస్ట్…

August 26, 2017

తమిళనాడు  రాజకీయాల్లో మరో ట్విస్ట్ ఇచ్చాడు డిఎంకే నేత స్టాలిన్. పళని స్వామి ప్రభుత్వ మైనార్టీలో ఉందని, బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ను కోరారు. దినకరణ్ వర్గానికి చెందిన 19 మంది ఎంఎల్యేలపై వేటు వేసుందుకు  పళని రెఢీగా ఉన్న విషయాన్ని  చెప్పారు. పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన వారు  పళని స్వామిని గతంలో వ్యతిరేకించిన విషయాన్ని ప్రస్తావించారు.

నిజంగానే  పళని స్వామి ప్రభుత్వం బల  నిరూపణ చేసుకోవాల్సి వస్తే పరిస్థితి చేయి దాటి  పోతుంది. పళని స్వామికి పదవి గండం పొంచి ఉన్నట్లే లెక్క. పన్నీర్ వర్గానికి చెందిన వారిని కలుపుకున్నా కూడా రావాల్సిన మెజార్టీ రాదు. అయినా స్టాలిన్  ఏ అంచనాతో ప్రభుత్వాన్ని బల పరీక్షకు పెడుతున్నారో మరి. ఆయనకు కాంగ్రెస్, మిత్ర పక్షాలు మద్దతు ఇస్తాయని అనుకుంటున్నారేమో మరి.

తమిళనాడులో రోజుకో రాజకీయ సంలచనం జరుగుతూనే ఉంది. తాజాగా విపక్షనే తెరపైకి వచ్చారు. ఇన్నాళ్లు అదును కోసం చూస్తున్న స్టాలిన్ దీన్ని బాగా వాడుకునేట్లు కన్పిస్తున్నది పరిస్థితి. ఏదో రకంగా ఏఐడిఎంకే ను వీక్ చేయాలనే ఆయన పాచిక పారుతున్నది.  రెండు శిబిరాలుగా వీడిపోయిన పార్టీని, ప్రభుత్వాన్ని పడగొడ్తే కొత్త  జరిగి రాజకీయ సమీకరణాలు తనకు  అనకూలంగా ఉంటాయని స్టాలిన్ భావిస్తున్నట్లుంది.