తమిళనాడు సిన్మాలు రాజకీయాలు చుట్టూ తిరిగినా తిరగక పోయినా రాజకీయాలు మాత్రం వాటి చుట్టే తిరుగుతున్నాయి. సిన్మాల కంటే రాజకీయాల్లోనే మరీ ఎక్కువ మలుపులుంటున్నాయి. కొన్ని సార్లు ఊహకందని సస్పెన్స్ లున్నాయి. కొన్ని సార్లు అరే స్టోరీ అడ్డం తిరిగాల్సిందే అన్పిస్తుంది. ఇంకొన్ని సార్లు అరే కొత్త స్టార్ మళ్లీ వచ్చాడే అన్పిస్తుంది. అయ్యో అంతట్లనే ఇంత పని అయిందా అన్పిస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే తమిళనాడు రాజకీయాల వ్యవహారం చేతాడంత కాదు చంద్రమండలం పొడవంత అవుతుంది.
అస్సలు విషయంలోకి వద్దాం. తమిళనాడు రాజకీయాలు సిన్మాళ్ల చేతుల్లో ప్రాణం పోసుకుని నిలబడ్డాయి. అభిమానులూ రీల్ లైఫ్ లో చూపించినట్లు గానే రియల్ లైఫ్ లో కూడా అంతే అభిమానం చూపించారు. నాటి అన్నదురై నుండి కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత అక్కడి నుండి అంతో ఇంతో డిఎండీకే నేత విజయ్ కాంత్, శరత్ కుమార్ వరకు రాజకీయాలు సిన్మా చుట్టూ తిరుగుతున్నాయి.
నాటి అన్నా దురై రాజకీయం ఒక ఎత్తు. నాటి పరిస్థితులకు తగ్గట్లు ఆయన రాజకీయం నడిపారు. తనుకు తిరుగు లేదని నిరూపించుకున్నారు. తమిళనాడ కొత్త తరహా రాజకీయాలు ప్రారంభించారు. కమ్యూనిస్టు చైతన్యం కాక పోయినా అలాంటి చైతన్యమే తీసుకొచ్చారు. ప్రజలను శాస్ర్తీయ ఆలోచన వైపు మళ్లించారు. అంతే కాదు తన వారసులైన కరుణానిధి, ఆ తర్వాత ఏఐడిఎంకే పెట్టిన ఎంజీఆర్ కూడా దాదాపు అదే బాటలో నడిచారు. తమ కంటూ ఓ స్థానం క్రియేట్ చేసుకున్నారు.
జయలలిత తిరుగు లేని నాయికిగా సిన్మాల్లనే కాదు రాజకీయాల్లోనూ ఎదిగారు. పార్టీని, ప్రభుత్వాన్ని, ప్రజలను తన వైపు తిప్పుకున్నారు. అమ్మ మరణం తర్వాత తమిళనాడు రాజకీయాలు ఊహకందని మలుపులు తిరుగుతున్నాయి. కొత్త కొత్త పాత్రలు తెరంగేట్రం చేస్తున్నాయి.సిన్మాళ్లు నడిపిన పార్టీలకు…. నాయకులకు… ప్రజలకు సరి కొత్త సిన్మా చూపిస్తున్నారు. ఆరు నెలల కాలంలోనే ఎన్ని ట్వీస్టు లో. టివీ ఓ దగ్గర ఉంటే రిమోట్ మరో దగ్గర ఉన్నట్లు అమ్మ ఉండగానే ఈ ఫార్మూలా అమలైనా… దాన్ని జనం పెద్దగా పట్టించుకోలేదు. అయితే రిమోట్ చిన్నమ్మ…. శశికళ చేతిలోకి వెళ్లగానే అదరిపోయారు.
ఆ తర్వాత దినకరన్ రూపంలో మరో పాత్ర ఎంట్రీ ఇచ్చింది. ఈ పాత్ర ఇండియానే అదిరిపోయే రేంజ్ లో పెర్మాఫార్మెన్స్ చూపించింది. సిన్మారంగం నుండి రానీ పాత పాత్రలు పన్నీర్ అండ్ పళని స్వామలు సరి కొత్త నటనుకు తెర తీశారు. రాజకీయాల్లో నేర్చుకున్న పాఠాలు కాబట్టి ఇద్దరూ ఒకే అనుకున్నారు. చేతులు కలిపారు. చిన్నమ్మకు ఫుల్ స్టాప్ పెట్టేస్తామంటున్నారు.
ఇవిట్లా జరుగడానికి ముందుగానే ‘‘కాళీ’’ రూపంలో ‘‘కబాలి’’ రీల్ నుండి రియల్ పాలిటిక్స్ లోకి వస్తున్నట్లు సిగ్నల్స్ ఇచ్చాడు. ఆ దేవుడు శాంసించాడ… ఈ బాబా ఆచరిస్తాడన్నట్లు చెప్పారు. అభిమానులతో ఫోటో సెషన్ పెట్టుకున్నారు. సెల్ఫీలు తీసుకున్నారు. పార్టీ గురించి ఏదో ప్రకటన చేస్తారనే లోపే ఆరోగ్యం బాగా లేదని అమెరికాకు పోయారు. ఆ తర్వాత ఇంటి వారు ఈ బాబా రాజకీయ అరంగేట్రం గురించి పొడి పొడిగా నాలుగు మాటలు చెప్పారు. ఆ తర్వాత ఆయన ఎందుకో కామ్ అయ్యారు.
ఈ ఎపి సోడ్ ముగిసి పోక ముందే మరో తార ’’దశవతారాల‘‘ నుండి పదకొండో అవతారం చూపిస్తానని మీడియాలో మిలుక్కు మన్నారు కమల్ హాసన్ సారు. ఆ తర్వాత రాజకీయాల గురించి ఏమీ మాట్లాడనని చెప్పారు. ఇప్పుడు అవినీతి కోటను ముట్టించాలని పిలుపునిచ్చారు. అభిమానులు రెఢీగా ఉండాలని సెలవిచ్చారు.రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పారు. రజనీ కాంత్ విషయం ఏమీ తేలకుండానే మరో తార రెఢీగా ఉండటంతో జనాలకు వెండి తెర నుండి పాలిటిక్స్ లోకి వస్తుండటంతో కొత్త ఎంటర్ టైన్మెంట్ పాలిటిక్స్ లోకి వచ్చినట్లైంది.
అప్పుడెప్పుడో 1980ల్లోనే రాజకీయాల్లోకి రావాల్సి ఉండే కానీ రాలేదన్నారీ మధ్య కమల్ హాసన్. ఇప్పుడు టైం వచ్చి తానే వస్తున్నట్లు చెప్తున్నారు. నిజమే మరి. ఇద్దరు స్టార్లు ఒకే సారి రాజకీయాల్లోకి వస్తున్నారంటే ఆసక్తి ఉంటుంది కదా.అయినా ఏఐడిఎంకే లోనీ ఆ నలుగురు శశికళ, పన్నీర్, పళని, దినకరన్ ల పాత్రల పరిస్థితి తేలక ముందే కొత్త పాత్రలు ఎంట్రీ ఇస్తున్నాయి. కమల్ హాసన్ ఇంటి వద్ద నెల రోజుల కిందనే సెక్యూరిటీ పెరిగింది. ఇప్పుడు అభిమానుల, ఆశావాహుల తాకిడి పెరుగుతుంది కావొచ్చు.
మరో సారి పాత స్టార్లు కొత్త రాజకీయం తమిళనాడులో స్టార్ట్ చేస్తారన్నట్లు. స్టార్లకున్న ఇమేజీ అలాంటిది మరి. అందుకే ధైర్యం చేసి వస్తున్నట్లుంది. మేకప్ వేసుకున్నంత ఈజీ కాదు రాజకీయం నడపటం అంటే. అయినా జనాలకు మేలు చేసేందుకు వస్తామంటే ఎవరు మాత్రం వద్దంటారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాల గురించి విశ్లేషకులు ఎట్లా అయినా అంచనా వేసుకోవచ్చు. కానీ జనాలకు మాత్రం పరిశీలన, పాత, కొత్తల వ్యవహారాలు అన్నీ తెలుసు. మరీ కొత్త స్టార్ల మూవీ ఎట్లా ఉంటుందో మరి.
మిత్రవాక్యం : వెండి తెర స్టార్లు పాలిటిక్స్ లోకి రావడం వరకే మీ వంతు ఆ తర్వాత…. నటిస్తారో.. జీవిస్తారో…. ఏం చేస్తారో తెలియదు. ఏదో ఒకటి మాత్రం చేయాలి. కానీ శశికళలు, పన్నీర్, పళని లాంటి వారూ ఉంటారు ఇక మీ ఇష్టం.
అసురాసుర.