‘కరోనాను పోగొట్టే’ మైసూర్ పాక్ దుకాణం సీజ్.. - MicTv.in - Telugu News
mictv telugu

‘కరోనాను పోగొట్టే’ మైసూర్ పాక్ దుకాణం సీజ్..

July 9, 2020

tamilnadu sweet shop sealed.

కరోనా వైరస్ వ్యాక్సిన్ కనిపెట్టాడానికి ఎందరో శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయినా కూడా ఇంకా ఎవ్వరూ కరొనాకు మందు కనిపెట్టలేకపోయారు. ఇదిలా కొన్ని రోజుల క్రితం తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలోని చిన్నియం పాళయంలో ఉన్న తిరునెల్వేలి లాలా స్వీట్ షాపు మాత్రం తమ దుకాణంలోని హెర్బల్ మైసూర్ పాక్ తింటే కరోనా తగ్గుతుందని ప్రకటించి సంచలనం సృష్టించింది.

అంతేకాకుండా కరోనా వైరస్ లక్షణాలున్న వారికి ఉచితంగా అందిస్తామని ఆ షాపు యాజమాన్యం పేర్కొంది. ఈ ‘హెర్బల్ మైసూర్ పాక్’ ఫార్ములాను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు కూడా సిద్ధంగానే ఉన్నామని ప్రకటించింది. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు ఈ దుకాణం గురించి విచారణ మొదలెట్టారు. ఈ ప్రచారంతో ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించడమే అని ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రమేశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆ దుకాణాన్ని అధికారులు సీజ్‌ చేశారు. దుకాణం నుంచి 120 కిలోల మైసూరు పాక్‌ను స్వాధీనం చేసుకున్నారు.