బస్సులో వెళ్తున్న యువతికి బలవంతంగా తాళి కట్టిన యువకుడు - MicTv.in - Telugu News
mictv telugu

బస్సులో వెళ్తున్న యువతికి బలవంతంగా తాళి కట్టిన యువకుడు

December 11, 2019

Tamilnadu 01

సినిమాల్లో రౌడీలు చేసినట్టుగానే బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడు ఓ యువకుడు. బస్సులో తన ఊరికి వెళ్తున్న యువతికి బలవంతంగా తాళి కట్టాడు. తమిళనాడులోని సాండ్రోర్‌ కుప్పంలో ఈ ఘటన జరిగింది. ఇష్టం లేకుండా యువతికి తాళికట్టిన జగన్‌కు స్థానికులు దేహశుద్ధి చేశారు. వెంటనే అతన్ని పోలీసులు అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. 

ఆంబూరు గ్రామానికి చెందిన యువతి తన చదువు కోసం ప్రతి రోజు వాణియంబాడికి బస్సులో వెళ్తోంది.సాండ్రోర్‌ కుప్పం గ్రామానికి చెందిన జగన్ కొంత కాలంగా ఆ యువతిని ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. ఆమెకు ఇటీవల వివాహం నిశ్చమైన విషయాన్ని తెలుసుకున్న జగన్ ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. బస్సులో వెళ్తున్న సమయంలో  తన వెంట తెచ్చుకున్న తాళిని ఆమె మెడలో బలవంతంగా కట్టాడు. యువతి కేకలు పెట్టడంతో మిగితా ప్రయాణికులు అతనిపై దాడి చేసి పోలీసులకు అప్పగించారు.