అన్నను తోసేసి...తమ్ముడు తాళి కట్టినాడురో..! - MicTv.in - Telugu News
mictv telugu

అన్నను తోసేసి…తమ్ముడు తాళి కట్టినాడురో..!

June 2, 2017

అన్న పెళ్లికి తమ్ముడి హడావుడి అంతా ఇంతా ఉండదు..కానీ ఈ తమ్ముడు మరి ఓవరాక్షన్ చేశాడు. పెళ్లి పీటలపై తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్న అన్నను తోసేసి వధువుకు తాళి కట్టేశాడు..విస్మయం కలిగే వార్తే అయినా..ఇది జరిగింది ఎక్కడో తెలుసా..

తమిళనాడులోని వేలూరు జిల్లాలోని తిరుపత్తూరు సెల్లరైపట్టికి చెందిన కామరాజ్‌కు రంజిత్‌, రాజేష్‌, వినోద్‌ అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఆర్నెళ్ల క్రితం రెండో కుమారుడు రాజేష్‌కు మదురైకి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయించారు. గురువారం ఉదయం ఇలవంపట్టి వెన్‌కల్‌ ప్రాంతంలోని మురుగన్‌ ఆలయంలో వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. వధూవరులను పెళ్లి పీటలపై కూర్చోపెట్టి పురోహితులు మంగళసూత్రాన్ని వరుడి చేతికిచ్చి వధువు మెడలో కట్టమని చెబుతుండగా వినోద్‌ పీటలపై ఉన్న అన్నను పక్కకు తోసేసి తన జేబులో దాచుకున్న మరో తాళిని తీసి వధువు మెడలో కట్టాడు. దీంతో బంధుమిత్రులు, తల్లిదండ్రులు ఆగ్రహంతో వినోద్‌ను చితకబాదారు. ఆ తరువాత వినోద్‌ను, వధువును విచారించగా రాజేష్‌కు పెళ్లి చూపులు చూస్తుండగానే వినోద్‌, వధువు ఇద్దరూ ప్రేమించుకున్నారట..