తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం.. - MicTv.in - Telugu News
mictv telugu

తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం..

April 6, 2020

ప్రముఖ టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇంట్లో విషాదం జరిగింది. ఆయన తల్లి కృష్ణవేణి (94) ఈరోజు మృతి చెందారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 

గత రెండు నెలలుగా తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని భరద్వాజ చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న తన మిత్రులు, శ్రేయోభిలాషులు తనకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో ఉన్నందున తనను పరామర్శించే నిమిత్తం ఎవరూ తన ఇంటికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి, తమ్మారెడ్డి భరద్వాజకు ఫోన్ చేసి పరామర్శించారు.