ఇండస్ట్రీలో రాణించాలంటే లౌక్యం ముఖ్యం. ఆచీతూచీ వ్యవహరించే మాటకారితనం ఉన్నవారికే చిత్రపరిశ్రమలో మనుగడ. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే తొక్కిపడేస్తారు. ఈ నేపథ్యంలో కాస్త నిర్మొహమాటంగా మాట్లాడే అతి కొద్దిమంది చిత్రపరిశ్రమ ప్రముఖుల్లో సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. అనేక సినీ రాజకీయ అంశాలపై తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటారు తమ్మారెడ్డి. ఈ సందర్భంగా తాజాగా మెగా స్టార్ చిరంజీవి గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ.. నాగబాబు వ్యవహారశైలిపై మండిపడ్డారు. చిరంజీవి లాంటి మెగాస్టార్ ని జాకీ పెట్టి లేపాల్సిన అవసరం లేదని.. ఆయన స్థాయి, రేంజ్ వేరని పొగడ్తల వర్షం కురిపించారు తమ్మారెడ్డి.
రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన చిరంజీవి, బాలకృష్ణల గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఇండస్ట్రీలో చిరంజీవి బాలకృష్ణకి పడదని ఏదేదో అనుకుంటారు. కానీ అట్లా ఏముండదు. ఇక ప్రతి ఒక్క స్టార్ హీరోకి బ్యాడ్ టైం ఉంటుందని. దాన్ని అధిగమించి వచ్చిన వారు మళ్ళీ స్టార్స్ అవుతారని.. అధిగమించలేనోళ్ళు అస్తమిస్తారని అన్నాడు. ఇక కొందరు మాట్లాడుతూ.. చిరంజీవికి మార్కెట్ తగ్గిపోయిందని.. రెండో హీరో ఉంటేనే చిరంజీవి సినిమాలు ఆడుతాయని పిచ్చి కూతలు కూస్తున్నారు. నాకు తెలిసి ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో టాప్ 1 నుండి 10 వరకు అన్ని చిరంజీవినే. ఆయన స్థాయి, మార్కెట్ ఆయనకీ ఉన్నాయి. అంతెందుకు మొన్నటి వరకు బాలకృష్ణ సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్స్ అయ్యాయి. కానీ ఇప్పుడు బాలయ్య ఓవర్ కమ్ అయ్యారు. ఇప్పుడు బాలయ్య స్థాయి వేరు.
ఇక రీసెంట్గా నాగబాబు గారు ఓ ఈవెంట్లో మాట్లాడుతూ ఎవరో చిరంజీవిగారికి రెడ్ కార్పెట్ పరిచారు. తర్వాత తక్కువగా మాట్లాడారు అన్నారు. నాకు తెలిసి చిరంజీవిగారు కొన్ని విషయాలను పట్టించుకోరు. నిజం చెప్పాలంటే చిరంజీవిగారు స్థాయికి ఇవన్నీ పట్టించుకోకూడదు కూడా. మరి ఆ రెడ్ కార్పెట్ వేసిన వ్యక్తి చిరంజీవిగారితో ఏ అవసరం వచ్చి వచ్చారో మనకు తెలియదు. అదెవరో కూడా నాకు తెలియదు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవటం ఎందుకు? నాగబాబుగారు అలాంటి విషయాలను మాట్లాడకపోతే.. చిరంజీవిగారి గౌరవం ఇంకా పెరుగుతుందని.. నాగబాబు సైలెంట్ కావటం ఉత్తమం అని నేను అనుకుంటున్నాను అని అన్నారు తమ్మారెడ్డి.