Tammareddy Bharadwaja made funny comments on Galodu movie
mictv telugu

సుధీర్ గాలోడు చించేసేది కాదు.. సినిమా చూసి చాలా బాధేసింది

November 23, 2022

Tammareddy Bharadwaja made funny comments on Galodu movie

బుల్లితెరపై పాపులారిటీ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ అప్పుడప్పుడూ వెండితెరపై తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే హీరోగా రెండు సినిమాలు చేసిన సుధీర్ తన మూడో సినిమా గాలోడుతో ఇటీవలే అభిమానులను పలకరించాడు. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా మంగళవారంతో బ్రేక్ ఈవెన్ సాధించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్ర యూనిట్ సక్సెస్ సభ నిర్వహించారు.

ఇందులో పాల్గొన్న తమ్మారెడ్డి భరద్వాజ కొన్ని ఆసక్తికర అంశాలను అభిమానులతో పంచుకున్నారు. ‘ ఈ చిత్రంలో నటింపజేయడానికి నా దగ్గరికి వచ్చి సీన్ చెప్తున్నప్పుడు ఇంట్రెస్టింగ్ గా అనిపించి చేయాలనుకున్నాను. కానీ గాలోడు టైటిల్ చూసి కొంత సందేహపడ్డాను. మొత్తంగా చూస్తే గాలోడు సినిమా పెద్ద చింపేసే కథ కాదు. కానీ డైరెక్టర్ తన కథ, కథనంతో మాయ చేశారు. ఇక సుధీర్ చాలా కష్టపడ్డాడు. దాంతో పాటు లక్ కూడా కలిసి వచ్చింది. కెమెరామెన్ అందరినీ బాగా చూపించాడు. కానీ నన్నే బ్యాడ్ గా చూపించాడు. సినిమా చూసిన తర్వాత నేను ఎంత బ్యాడ్ నటుడినో తెలిసింది. సినిమాలో నా సీన్ చూసి నాకు చాలా బాధేసింది’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.