ఆమె సింగిల్‌‌గా ఉంటే ఏంటి? డబుల్‌‌గా ఉంటే ఏంటి? - తమ్మారెడ్డి ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆమె సింగిల్‌‌గా ఉంటే ఏంటి? డబుల్‌‌గా ఉంటే ఏంటి? – తమ్మారెడ్డి ఫైర్

November 12, 2022

చిత్రపరిశ్రమలో ఉండే హీరో, హీరోయిన్లు సాధారణంగా ఎక్కువగా ట్రోలింగ్‌‌కి గురవుతుంటారు. రీసెంట్‌గా క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్నా కన్నడ నాట విపరీత ట్రోలింగ్‌కి గురై మనస్థాపంతో సుదీర్ఘ వివరణ కూడా ఇచ్చింది. దీనిపై సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తన అభిప్రాయాలను ఇలా చెప్పుకొచ్చారు. ‘రష్మిక తనకు నచ్చిన డ్రెస్సులు వేసుకుంటుంది. తన అభిప్రాయం చెప్తుంది. అందుకు ఆమెను ట్రోల్ చేయనవసరం లేదు. ఆ హక్కు వేరేవాళ్లకు లేదు కూడా. కానీ, ట్రోలింగ్‌కి గురికావడానికి కొన్ని అంశాలు కారణమవుతున్నాయి. ఎవరైతే తమ పర్సనల్ విషయాలు పబ్లిక్‌లో పెడతారో వారే దీని బారిన పడతారు.

కొంత మంది అమ్మాయిలు ఫేస్బుక్‌లో నేను సింగిల్ అని పోస్ట్ పెడతారు. ఆమె సింగిల్‌గా ఉంటే ఏంటీ? డబుల్ గా ఉంటే ఏంటీ? ఆ విషయం బయటకు చెప్పడం ఎందుకు? అవతల వారిని రెచ్చగొట్టడమే కదా అని అభిప్రాయపడ్డారు. ఇక సినిమా వాళ్ళ పెళ్లిళ్ళు, హనీమూన్‌‌లపై ఓ రేంజ్‌‌లో దుయ్యబట్టారు. ‘ఎవరైనా సరే పర్సనల్ విషయాలు పబ్లిక్‌‌లో పెట్టకూడదు. కొంతమంది తమ పెళ్లి వీడియో హక్కులను టీవీలకో, డిజిటల్ వారికో అమ్మేస్తుంటారు. అసలు పెళ్లి అనేదే కుటుంబానికి సంబంధించిన విషయం. ఇక హనీమూన్ ఆ జంట పర్సనల్. కానీ, కొందరు దానిని కూడా డబ్బులకు అమ్మేసుకొని కమర్షియల్ చేసేస్తున్నారు. ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి హనీమూన్ అనేది పెట్టారు. కానీ, అమ్మేసుకొని సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నట్టు? మనం నోరు మూసుకొని కూర్చుంటే ఎదుటివారు ఎందుకు అంటారు. అందుకు వ్యతిరేకంగా చేస్తేనే ట్రోలింగ్ జరిగుతూనే ఉంటుంది’ అని వివరించారు.