tammareddy bharadwaja serious on vishwak sen
mictv telugu

అంత బలుపొద్దమ్మా.. తమ్మారెడ్డి సీరియస్

November 8, 2022

tammareddy bharadwaja serious on vishwak sen

హీరోలు అర్జున్ విశ్వక్ సేన్ ల వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. నచ్చినట్టు మార్పులు చేయడంలేదని షూటింగ్ నుండి అర్దాంతరంగా వైదొలిగాడు విశ్వక్. అయితే అగ్రిమెంట్ అయ్యాకా రేపు షూటింగ్ అన్న తరుణంలో మెసేజ్ పెట్టి సినిమా ఎగ్గొట్టాడని హీరో అర్జున్ వాపోతున్నాడు. అయితే ఇంతవరకు ఇండస్ట్రీ పెద్దలెవరు ఈ ఇష్యూపై స్పందించలేదు. వివాదరహితుడిగా పేరున్న సీనియర్ హీరో అర్జున్ ఆవేదనలో అర్ధం ఉందని అందరు భావిస్తున్నా బయటపడటం లేదు. ఈ నేపథ్యంలో సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి స్పందించారు. ఈ వివాదంలో విశ్వక్ తప్పుందని.. ఇలాగే ఉంటే ఇలాంటి హీరోలతో నిర్మాతలెవ్వరు సినిమాలు చేయరని చెప్పారు తమ్మారెడ్డి. ఒక యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ అర్జున్ విశ్వక్ వివాదం పై తమ్మారెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘ఒక సినిమా కమిట్ అవ్వకముందే.. నిర్మాతతో చేయొచ్చా, కథ బావుందా, కథలో ఇంకేమైనా మార్పులు అవసరమా, పారితోషకం పెంచాలా అన్న విషయాలన్నీ చర్చించుకోవాలి. అంత ఒకే అనుకున్నాకా అగ్రిమెంట్స్ చేసుకోవాలి. అంతేకాని షూటింగ్ రోజున సినిమా నుండి తప్పుకోవటం తప్పే. ఇది దర్మం అనిపించుకోదు. అప్పట్లో ఎన్టీఆర్ ఒక సినిమాకి కమిట్ అయ్యాకా.. పూర్తిగా దర్శక నిర్మాతలు చెప్పినట్టు నడుచుకునే వాడు. ఇప్పటి హీరోల్లో బాలకృష్ణలో నాకు ఆ కమిట్మెంట్ కనిపిస్తుంది. ఎంత చిన్న దర్శకుడు చెప్పినా బాలయ్య చేసేస్తాడు. దర్శకుడికి మార్పులు చెప్తూ కథలో ఇన్వాల్వ్ అవ్వడు. కానీ ఇప్పటి హీరోలు దర్శకుడి పనిలో అనవసరంగా వేలు పెడుతున్నారు. ఇది వారికే మంచిది కాదు. అర్జున్ హీరో మాత్రమే కాదు. అద్భుతమైన దర్శకుడు కూడా. సొంత కథలతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు. ఇప్పుడు అర్జున్ అవుట్ డేటెడ్ అనుకుంటే అసలు విశ్వక్ సినిమానే ఒప్పుకోవాల్సింది కాదు. యువ హీరోలు ఈ మధ్య ఎక్కువగా దర్శకుడి పనిలో ఇన్వాల్వ్ అవుతున్నారు. అందుకే సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. దర్శకుడిని నమ్మినప్పుడే సూపర్ హిట్స్ వస్తాయి’ అని చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి. ఇక విశ్వక్ తీరు మొదటి నుండి ఇంతేనని నెటిజన్న్ సైతం విమర్శిస్తున్నారు. ఎదిగే స్టేజిలో బలుపు ఉంటే సక్సెస్ అవ్వరని.. ఎంత ట్యాలెంట్ ఉన్నా.. యాటిట్యూడ్ బావుండాలని విశ్వక్ అర్జున్ వివాదంపై కామెంట్స్ వస్తున్నాయి.