Tammareddy Bharadwaja Shocking comments on the result of Vijay Devarakonda's movie 'Liger'
mictv telugu

ఎగిరెగిరిపడితే ఇలాంటి ఎదురుదెబ్బలే తగులుతాయి.. ‘లైగర్‌’పై షాకింగ్‌ కామెంట్స్‌

September 1, 2022

యాక్టర్ల యాక్షన్‌ల బట్టే ప్రేక్షకుల రియాక్షన్ ఉంటుందన్నారు ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఇటీవల విడుదలైన విజయ్‌ దేవరకొండ సినిమా ‘లైగర్‌’ రిజల్ట్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఎగిరెగిరిపడితే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయని ఆయన అన్నారు. ‘‘సినిమా అనే కాదు ఏ విషయంలోనూ ఎగిరెగిరిపడొద్దు. అలా చేస్తే ఇలాంటి ఎదురుదెబ్బలే తగులుతాయి. ‘మేము ఎంతో కష్టపడి చిత్రాన్ని తెరకెక్కించాం. మా చిత్రాన్ని చూడండి’ అంటూ ఏ చిత్రబృందమైన తమ సినిమాని ప్రేక్షకుల్లో ప్రమోట్‌ చేసుకుంటే సరిపోతుంది. అంతేకానీ, నువ్వు చిటికెలు వేస్తే.. ప్రేక్షకులు ఇలాంటి సమాధానమే చెబుతారు’’ అని ఆయన అన్నారు.

సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణాలను అడగ్గా ‘‘ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడను. సాధారణంగా నేను పూరీ జగన్నాథ్‌ అభిమానిని. ఆయన సినిమాలంటే నాకెంతో ఇష్టం. కానీ, ‘లైగర్‌’ ట్రైలర్‌ చూసినప్పుడే చిత్రాన్ని చూడాలనిపించలేదు. ఒకవేళ భవిష్యత్తులో చూడాలనిపిస్తే చూస్తా’’ అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.