తమ్మారెడ్డి కౌంటర్...నాగబాబు సైలెంట్..వివాదానికి తెరపడినట్లేనా? - MicTv.in - Telugu News
mictv telugu

తమ్మారెడ్డి కౌంటర్…నాగబాబు సైలెంట్..వివాదానికి తెరపడినట్లేనా?

March 12, 2023

దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ సెమినార్ లో చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ దర్శకుడు కే రాఘవేంద్రరావు, నటుడు నాగబాబు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ మూవీని ఆస్కార్ వరకు తీసుకెళ్లేందుకు టీం రూ. 80కోట్లు ఖర్చు చేసిందంటూ భరద్వాజ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా మీ దగ్గర అకౌంట్స్ ఉన్నాయా. అంటే హాలీవుడ్ దిగ్గజాలు కూడా డబ్బులు తీసుకుని పొగుడుతున్నారని మీ అర్థమా అంటూ రాఘవేంద్రరావు ట్వీట్ చేశారు.

నాగబాబు వ్యాఖ్యలకు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అతినీచంగా నీయమ్మా మొగుడు ఎనభై కోట్లు ఖర్చు చేశాడా అంటూ ఓ రేంజ్ లో ట్వీట్ చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్ కు రాజకీయ రంగును అద్దే ప్రయత్నం చేశారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఒక బైట్ కూడా విడుదల చేశారు. ఆ వీడియోలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

వీరిద్దరి వ్యాఖ్యలపై తమ్మారెడ్డి స్పందించారు. మూడు గంటల సెమినార్లో నేను మాట్లాడిన ఒక నిమిషం క్లిప్పింగ్ తీసుకోని ఆరోపణలు చేస్తున్నారు. నాకు ఇండస్ట్రీలో అందరి చరిత్రలు తెలుసు. అవార్డుల కోసం, పదవుల కోసం ఎవరు ఎవరి కాళ్లు మొక్కారో అదికూడా తెలుసు. భూమ్మీద లేని అమ్మనాన్నల గురించి ఎందుకు. నా అమ్మ మొగుడు నాకు సంస్కారం అనేది నేర్పించాడు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఈ కామెంట్స్ చేసినందుకు సిగ్గుపడండి. అంటూ ఓ స్థాయిలో ద్వజమెత్తాడు.

అయితే తమ్మారెడ్డి వ్యాఖ్యలకు నాగబాబు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎలాంటి కౌంటర్ ఇవ్వలేదు. మీడియా ముందుకు రానేలేదు. ఇదంతా చూస్తుంటే నాగబాబు, తమ్మారెడ్డిల వివాదానికి తెరపడినట్లేనా ? అంటున్నారు. ఇక్కడితో ఇద్దరూ కూడా ఆపేస్తే మంచిదంటున్నారు. అనవసరంగా వివాదాల్లోకి లాగడం సరికాదంటున్నారు. చూద్దాం మెగా బ్రదర్ రియక్ట్ అవుతారా మౌనంగా ఉంటారా అనేది.