Tammineni Krishnaiah murder case Two accused surrendered in court
mictv telugu

తమ్మినేని కృష్ణయ్య హత్యకేసు.. లొంగిపోయిన ఇద్దరు నిందితులు

September 2, 2022

ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు తమ్మినేని కోటేశ్వర రావు శుక్రవారం ఉదయం ఖమ్మం కోర్టులో లొంగిపోయారు. ఆయనతోపాటు మరో నిందితుడు ఏ10 నాగయ్య కూడా ఉన్నారు. టీఆర్‌ఎస్‌ నేత కృష్ణయ్య గత నెల 15న దారుణ హత్యకు గురయ్యారు. తమ్మినేని కృష్ణయ్య హత్య జరిగిన రోజు నుండి తమ్మినేని కోటేశ్వరరావు , నాగయ్యలు పరారీలో ఉన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న 11 మందిని పోలీసులు గత నెల 18న ఏపీలోని రాజమండ్రిలో అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పొన్నెకల్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి తెల్దారుపల్లికి తిరిగి వస్తున్న సమయంలో ప్రత్యర్ధులు తమ్మినేని కృష్ణయ్యను హత్య చేశారు. సీపీఎం శ్రేణులే తమ్మినేని కృష్ణయ్యను హత్య చేశారని ప్రత్యక్ష సాక్షి ముత్తేశం పోలీసులకు మీడియాకు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి తమ్మినేని కృష్ణయ్య తనయుడు నవీన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.