ఏపీ అసెంబ్లీ స్పీకర్ సీరియస్..హెడ్‌ఫోన్స్ పడేసి - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ అసెంబ్లీ స్పీకర్ సీరియస్..హెడ్‌ఫోన్స్ పడేసి

January 21, 2020

hbcr

ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్కసారిగా అసహనానికి లోనయ్యారు. టీడీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను తీవ్ర మనస్థాపానికి లోనయ్యానని పేర్కొంటు హెడ్ ఫోన్స్ టేబుల్‌పై పడేసి వెళ్లిపోయారు. దీంతో కొంతసేపు సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సభ్యుల తీరు సరిగాలేదున తాను సభ నుంచి వెళ్లిపోతున్నట్టు చెప్పి తన ఛాంబర్‌లోకి వెళ్లిపోయారు. 

సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు అమరావతి‌పై చర్చకు పట్టుబట్టారు. కానీ స్పీకర్ దానికి అనుమతించలేదు. ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చను ప్రారంభించారు. దీన్ని తప్పుబడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. సేవ్ అమరావతి అంటూ సభను హొరెత్తించారు. స్పీకర్ ఎన్నిసార్లు శాంతించాలని కోరినా వారు పట్టించుకోలేదు. గందరగోళ పరిస్థితి నెలకొనడంతో సభ్యుల తీరును తప్పుబట్టారు. ‘ఎన్నిసార్లు చెబుతున్నా వినిపించుకోరా.. మీ చర్యలకు నేను మనస్థాపానికి గురయ్యా, ఐయామ్ సారీ’ అంటూ కోపంతో తన హెడ్‌ఫోన్స్ టేబుల్ పై పడేసి వెళ్లిపోయారు.