ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం - MicTv.in - Telugu News
mictv telugu

ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం

June 13, 2019

 

Tammineni sitaram unanimously appointed as andhra pradesh assembly speaker.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభాపతిగా తమ్మినేని సీతారాం ఎన్నికపై అధికారిక ప్రకటన చేశారు. అయితే ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో సభాపతి ఎన్నిక ఏకగ్రీవమైంది. తమ్మినేని సీతారాంకు సీఎం జగన్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు.

తమ్మినేని సీతారాం ఇప్పటివరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో మొదటిసారి టీడీపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999 నుంచి 2009 వరకు శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పని చేశారు. 1994లో న్యాయశాఖ మంత్రిగా, 1995లో మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రిగా, 1999లో ఎక్సయిజ్ శాఖా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 2009 లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు. 2014లో వైసీపీలో చేరారు. 2014 లో బావమరిది రవి కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2019 లో ఆముదాలవలస నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.