రజినీకాంత్‌తో తెలంగాణ ఎమ్మెల్యే భేటీ - MicTv.in - Telugu News
mictv telugu

రజినీకాంత్‌తో తెలంగాణ ఎమ్మెల్యే భేటీ

November 7, 2019

rajinikanth...

తాండూరు ఎమ్మెల్యే, టీఆర్ఎస్ యువ నాయకుడు పైలట్ రోహిత్ రెడ్డి తన భార్య ఆర్తి రెడ్డి సమేతంగా ప్రముఖ నటుడు రజినీకాంత్‌ను కలిశారు. చెన్నైలోని రజనీకాంత్‌‌ ఇంట్లో ఆయన్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. పైలట్ రోహిత్ రెడ్డికి రజినీకాంత్ కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రోహిత్ రెడ్డి రజినీకాంత్ దగ్గరకు వెళ్లి ఆయన ఆశిర్వాదం తీసుకున్నారు. 

rajinikanth...

ఈ సందర్భంగా తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలు పెట్టుకున్న నమ్మాకానికి న్యాయం చేయాలని రజినీకాంత్ రోహిత్ రెడ్డికి హితబోధ చేశారు. రజినీకాంత్ రాజకీయాల్లోకి రాబోతున్న తరుణంలో రోహిత్ రెడ్డి ఆయన్ను కలవడం చర్చనీయాంశం అవుతోంది. అయితే వ్యక్తిగత భేటిలో భాగంగానే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రజినీకాంత్ కలిశారని ఎలాంటి రాజకీయాలు చర్చించలేదని సమాచారం. రోహిత్ రెడ్డి ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నారు. రోహిత్ రెడ్డి గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు ఎమేల్యేగా గెలుపొందారు.

rajinikanth...