మైక్ టీవీ ‘తంగేడు పూలు’కు అవార్డు - MicTv.in - Telugu News
mictv telugu

మైక్ టీవీ ‘తంగేడు పూలు’కు అవార్డు

December 18, 2017

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నిర్వహించిన పోటీలో గుర్తింపు

డిజిటల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో దూసుకెళ్తున్న మైక్ టీవీ ‘తంగేడు పూలు’ పేరుతో తీసిన లఘు చిత్రానికి అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నిర్వహించిన ‘యువచిత్రోత్సవం’లో అవార్డుకు ఎంపికైంది.  

తెలంగాణలో వెల్లివిరుస్తున్న మతసామరస్యాన్ని ఇందులో అద్భుతంగా చిత్రీకరించారు. ముస్లిం యువకుడికి, అతడు చెల్లిగా భావించే ఒక  హిందూ యువతికి బతుకమ్మ పండగతో, తంగెడుపూలతో బాల్యం నుంచి పెనవేసుకున్న అనుబంధాన్ని చూపారు. మతాలు వేరైనా.. పెరిగిపెద్దయ్యాక కూడా ఈ అనుబంధం వారిని, వారి కుటుంబాలను ఎలా కలిపి ఉంచిందో సహజమైన, హృద్యమైన సంభాషణలతో తీర్చిదిద్దారు. చక్కని సందేశమిచ్చారు.

 

‘తంగేడు పూలు’కు అప్పిరెడ్డి నిర్మాతగా, దాము కొసనం సహనిర్మాతగా వ్యవహరించారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వాల్మీకి వడ్డెమాని. సంఘీర్, ఆరెట్టి రోహిణి,  అంజి ఎస్కే, చైత్ర, పరమేశ్, మిసిమి, రోహిత్, గణేశ్ నటించారు. మహ్మద్ రఫీ, సాయి జూనియర్ అర్టిస్టులు. డీఓపీ తిరుపతి,  రాజు, పరమేశ్ కెమెరా అసిస్టెంట్లు. అంజి ఎస్కే అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేశారు. మాధవి డబ్బింగ్ ఆర్టిస్టుగా వ్యవహరించారు.  ఉదయ్ కంబం, సంపత్ కావ్య ఎడిటింగ్ చేయగా, సురేష్ బొబ్బలి సంగీతం అందించారు. 

ఈ లఘుచిత్రాన్ని మైక్ టీవీ త్వరలోనే తన యూట్యూబ్ చానల్లో అందిస్తుంది.