విజయదశమి రోజున హైదరాబాద్ నగరంలో జరుగుతున్న వరుస ప్రమాదాలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ రోజు ముత్యాలమ్మ దేవాలయం వద్ద డస్ట్‌బిన్‌లో బాంబు పేలుడు జరిగింది. అలాగే నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ కూడలిలో ఓ ట్యాంకర్ బీభత్సం సృష్టిస్తోంది. వేగంగా వచ్చిన ట్యాంకర్ అదుపుతప్పి ఇతర వాహనాలను తప్పిస్తూ రోడ్డుపై పల్టీలు కొట్టింది.
ఈప్రమాదంలో ట్యాంకర్ లారీ నుంచి పెట్రోల్ లీకైంది. దీంతో భారీ అగ్నిప్రమాదం జరుగుతుందని ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్‌ను అక్కడికి తెప్పించారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ లారీ డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి.