Tantrik asks couple to have sex in front of him, pours superglue, kills them
mictv telugu

శృంగారంలో ఉన్న జంటపై బంక పోసి చంపిన మాంత్రికుడు..

November 23, 2022

Tantrik asks couple to have sex in front of him, pours superglue, kills them

రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులను ఓ మాంత్రికుడు దారుణంగా హత్య చేసాడు. వివాహేతర సంబంధం కలిగి ఉన్న ఆ ఇద్దరిని తన కళ్లముందే శృంగారం చేయమని చెప్పి హతమార్చాడు. ఉదయపూర్‌లో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది.

ఉదయపూర్‌లోని కెలాబావాడీ అటవీ ప్రాంతంలో నవంబర్ 18వ తేదీన నగ్నంగా ఉన్న ఒక పురుషుడు, మహిళ మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని 30 ఏళ్ల టీచర్ రాహుల్ మీనా, 28 ఏళ్ల సోను కున్వర్‌గా గుర్తించారు. మొదట వివాహేతర సంబంధం నేపథ్యంలో పరువు హత్యగా భావించిన పోలీసులకు తర్వాత విస్తుపోయే నిజాలు తెలిశాయి. వారిని ఓ మాంత్రికుడు చంపినట్లు పోలీసులు తేల్చారు. అతడిని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.

రాహుల్, సోనూ ఇద్దరూ వేర్వేరు వ్యక్తులను వివాహం చేసుకున్నారు. భదవి గూడలోని ఇచ్ఛాపూర్ణ శేషనాగ్ భావ్‌జీ మందిర్‌లో వారి కుటుంబాలు తరచూ తాంత్రికుడిని సందర్శించేవారు. ఈ సమయంలోనే… రాహుల్, సోనులకు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధంగా మారింది. దీంతో హుల్ తన భార్యతో తరచుగా గొడవలు పడటం ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న రాహుల్ భార్య మాంత్రికుడి సహాయం కోరింది. దీంతో మాంత్రికుడికి, రాహుల్ కు మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో మాంత్రికుడిపై రాహుల్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో అప్రమత్తమైన తాంత్రికుడు రాహుల్‌ను చంపివేయాలని నిర్ణయించి పథకం రచించాడు.

దాదాపు పెవిక్విక్ లాంటి 50 ట్యూబ్‌ల సూపర్‌గ్లూ కొనుగోలు చేసి ముందుగా సీసాలో పోశాడు. నవంబర్ 15వ తేదీ సాయంత్రం రాహుల్, సోనూలను ఓ అడవిలోని ఏకాంత ప్రాంతానికి ఆహ్వానించి తన ఎదుటే శృంగారంలో పాల్గొనాల్సిందిగా కోరాడు. ఇద్దరూ కలయికలో పాల్గొన్న సమయంలో మాంత్రికుడు సూపర్‌గ్లూ బాటిల్‌ను వారిపై పోశాడు. దీంతో రాహుల్, సోను చాలా సేపు ఒకరికొకరు అతుక్కుపోయారని పోలీసులు తెలిపారు. వాస్తవానికి, ఒకరినొకరు దూరం చేసుకోవడానికి వారు చేసిన ప్రయత్నాలలో, వారి చర్మం చిరిగిపోయిందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి… కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.