తన్విత పెంచిన తల్లికే  సొంతం.. కోర్టు తీర్పు - MicTv.in - Telugu News
mictv telugu

తన్విత పెంచిన తల్లికే  సొంతం.. కోర్టు తీర్పు

April 4, 2018

కన్నప్రేమపై పెంచిన ప్రేమ గెలిచింది. చిన్నారి తన్వితను స్వరూపకే అప్పగించాలని కొత్తగూడెం కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. దీంతో బాలల సదనంలో ఉన్న పాపను స్వరూప అక్కున చేర్చుకుంది. తనివితీరా ముద్దాడింది. మరోపక్క.. కన్నబిడ్డకు దూరమైన ఉమ గుండెలనిండా బాధను అదిమిపెటుకుని దు:ఖిస్తోంది. కనింది తనే అయినా బిడ్డ భవిష్యత్తును, తన పేదరికాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమె.. బిడ్డను స్వరూపకు అప్పగించడానికి భారమైన హృదయంతో అంగీకరించింది. దీంతో కేసు పరిష్కారమైంది. తన్విత పెంపుడు తల్లి స్వరూప దగ్గరే తన్విత ఉండాలని కొత్త‌గూడెం 5వ అద‌న‌పు జిల్లా కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. కన్నుతెరిచినప్పటి నుంచి పాపను కంటికి రెప్పలా పెంచానని స్వరూప కోర్టుకు తెలిపింది.  కోర్టు ఆదేశం తర్వతా ప్రస్తుతం ఖమ్మం బాలల సదనం ఉన్న తన్వితను తన వెంట తీసుకు వెళ్లింది.కొత్తగూడెం భద్రాద్రిజిల్లా యల్లందుకు చెందిన ఉమ, మాలోతు బావూ సింగ్ దంపతుల బిడ్డ తన్విత. అయితే పేదరికం వల్ల గర్భంతో ఉన్నప్పుడే పుట్టేబిడ్డను మాణిక్యవరానికి చెందిన వేముల స్వరూప, రాజేంద్ర దంపతులకు ఇస్తామని ఉమ ఒప్పందం చేసుకుంది. సంతకం కూడా చేసింది. దాని ప్రకారం తన్విత వేముల ఇంటి పిల్లయింది. కానీ తర్వాత ఉమ పశ్చాత్తాపంతో అసలు విషయం బయటపెట్టి తన బిడ్డ తనకే కావాలని పోలీసులను ఆశ్రయించింది. విచారణ ముగిసేవరకు పాపను శిశు సంక్షేమ గృహంలో ఉంచాలని కోర్టు ఆదేశించింది.

కేసుతో విసుగెత్తిన ఉమ దంపతులు.. పాపను వేముల దంపతులకే ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు.  ‘తన్వితను అలా అనాథలా ఉంచడం కంటే పెంచిన తల్లికే ఇచ్చేస్తేనే మంచిది’ అని మాలోతు బావూ సింగ్ మీడియాతో అన్నాడు. ఉమకు ఇది ఇష్టం లేకపోయినా కోర్టు ఖర్చులకు డబ్బు లేకపోవడం, పేదరికం వంటి కారణాలతో ఆమె కూడా మెత్తబడింది. తన కన్నబిడ్డను స్వరూప దంపతుకు ఇచ్చేయానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నట్టు ఉమ ఇటీవల కొత్తకూడెం కోర్టుకు తెలిపాంది. కోర్టు, వాయిదాల కోసం 3 లక్షలు ఖర్చు చేశానని, ఇక పోరాడేశక్తి లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.