స్వస్థత కూటమిలో తొక్కిసలాట.. 20 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

స్వస్థత కూటమిలో తొక్కిసలాట.. 20 మంది మృతి

February 3, 2020

Tanzania.

రోగాలను తగ్గిస్తానని ఓ మత బోధకుడు చెప్పిన మాటలకు 20 మంది బలి అయ్యారు. అతడు ఇచ్చే నూనె కోసం జనం ఎగబడటంతో తొక్కిసలాట చోటుచేసుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. టాంజానియాలోని మోషి టౌన్‌లో ఎవాంజెలికల్‌ క్రిస్టియన్‌ చర్చి వద్ద జరిగింది. గాయపడిన మరికొంత మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీంతో అక్కడి నుంచి చల్లగా జారుకున్న ఆ మత బోధకుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

బోనిఫేస్‌ వాంపోసా మత బోధకుడు ప్రార్థన కార్యక్రమం పెట్టాడు.. తన వద్ద అతీత శక్తులు ఉన్నాయని వెంటనే రోగాలను నయం చేస్తానని మాయమాటలు చెప్పాడు. అతని మాటలను విన్న ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో తాను ఓ పవిత్రమైన నూనె తెచ్చానని నమ్మించి దాన్ని భక్తులపై చల్లడం ప్రారంభించారు.  అతని మాటలు గుడ్డిగా విశ్వసించిన ప్రజలు నూనె తమపై ఎక్కడ పడకుండా ఉంటుందోనని ఒక్కసారిగా ముందుకు వచ్చారు. ఈ ఘటనలో తోపులాట చోటుచేసుకొని 20 మంది మరణించాడు. 

మత బోధకుడి మాయ మాటలకు రోగాలు తగ్గడం మాట అటుంచితే.. పదుల సంఖ్యలో మరణించారు. ఈ ఘటనతో ఉలిక్కిపడిన బోనిఫేస్ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. వెంటనే అతన్ని వెతికి పట్టుకున్న  పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఎవరూ ఇలాంటి వారి మాయమాటలు నమ్మకూడదని ప్రజలకు సూచించారు. ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని విచారం వ్యక్తం చేశారు.