సినిమా పాటలతో పాపులరయిన టాంజానియా కిలీపాల్‌పై దాడి - MicTv.in - Telugu News
mictv telugu

సినిమా పాటలతో పాపులరయిన టాంజానియా కిలీపాల్‌పై దాడి

May 2, 2022

భారతీయ సినిమా పాటలకు షోరీల్ చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన టాంజానియా యువకుడు కిలీ పాల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్‌స్టాగ్రాం ద్వారా వెల్లడించారు. ‘నాపై కర్రలు, కత్తులతో ఐదుగురు దాడి చేశారు. నేను తిరిగి దాడి చేసి వారిలో ఇద్దరిని కొట్టడంతో భయపడి పారిపోయారు. ఈ క్రమంలో నా కుడి చేతి వేలికి గాయమైంది. ఐదు కుట్లు పడ్డాయి. దేవుడి దయ వల్ల నేను ప్రస్తుతం సేఫ్‌గా ఉన్నాను’ అంటూ ఫోటోలను పోస్ట్ చేశాడు. ఇది వైరల్ కావడంతో కొందరు ఇండియన్ నెటిజన్లు అతను త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. కాగా, పుష్ప, కేజీఎఫ్ సినిమాల హిందీ డబ్బింగ్ చిత్రాల పాటలను, డ్యాన్సులను, డైలాగులను అనుకరించి కిలీపాల్ పలు వీడియోలు చేశాడు.