మాట మార్చిన తాప్సీ… - MicTv.in - Telugu News
mictv telugu

మాట మార్చిన తాప్సీ…

August 19, 2017

తెలుగు సినిమాల్లో హీరోయిన్లను చవకబారుగా చూపుతారంటూ సటైర్లు వేసిన తాప్సీ ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. తాను ఇకపై తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తానని చెప్పుకొచ్చింది.

‘తెలుగు సినిమాల్లోనే వీలైనంత వరకు నటిస్తా.. ’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ ముద్దుగుమ్మకి ఉన్నట్టుంది ఏమైందబ్బా అని టాలీవుడ్ తెగ ఆశ్చర్యపోతోంది. అయినా డబ్బెవరికి చేదు అన్న సామెత ఉండనే ఉందిగా. డబ్బుతో పాటు ఫేమ్ కూడా అప్పనంగా దొరికిపోతే సినిమాలను.. అవి తెలుగువైనా, హిందీవైనా, చివరికి భోజ్పురి, అస్సామీ వంటివైనా ఎవరూ వదులుకోరని ఆ భామకు ఎవరో బాగానే నూరిపోసినట్టు ఉంది.

దర్శకేంద్రుడు తన సినిమాల్లో హీరోయిన్లను అతిగా చూపిస్తారని తాప్సీ ఎక్కసెక్కాలాడ్డం తెలిసిందే.  ఇందంతా బాలీవుడ్ లో తన ఒకటి, రెండు సినిమాలు హిట్ కాగానే  వచ్చిన పొగరేమో? తెలుగు సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు హీరోయిన్ల దాకా రావని, కేవలం హీరోయిన్ల్ గ్లామర్ కే పరిమితం అని ఆవిడ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు అంతలోనే ఇంత మార్పా? ఇది ఆశ్చర్యకరమైన విషయమే.

‘ఆనందో బ్రహ్మ’మూవీ ప్రమోషన్ కోసం హైదరబాద్ వచ్చిన తాప్సీలో చాలా మార్పలు కనిపిస్తున్నాయట. ఎక్కువగా తెలుగు సినిమాల్లోను, గ్లామరస్ పాత్రల్లోను నటిస్తానని అటోంది.

బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా, ఏ ఇండస్ట్రీ అయిన మంచి, చెడులు రెండూ ఉంటాయి. అది మనం అర్థం చేసుకోవడంలో ఉంటుందని తాప్సీకి ఇప్పటికైనా అర్థం అయినందుకు సంతోషం అంటున్నాయి సినీ వర్గాలు.